సోనియా సమక్షంలో ఇప్పటికే రెండుసార్లు తెలంగాణ అంశంపై భేటీ శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని సిఫారసులు సహా పలు ప్రతిపాదనలపై చర్చలు భిన్నాభిప్రాయాలు వ్యక్తమయినా,చివరకు విభజన దిశగానే ఆలోచనలు తెలంగాణ ఏర్పాటు చేస్తూనే.. ఇతర రాష్ట్ర డిమాండ్లపై రెండో ఎస్‌ఆర్‌సీ ప్రకటన? దశాబ్దం పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్.. లేదా కేంద్రపాలిత ప్రాంతం! ముఖ్యమంత్రి కిరణ్‌కూ అందిన సంకేతాలు..!, కాంగ్రెస్‌లో రేగుతున్న కలకలం అనుకూల, ప్రతికూల వాదాలతో చివరి దశ ఒత్తిడి ప్రయత్నాల్లో నేతలు
ప్రత్యేక తెలంగాణ అంశంపై కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన మారుతోందా? తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక అభివృద్ధి మండలి ఏర్పాటు చేయాలన్న ఆలోచనను మార్చుకుని.. ఆంధ్రప్రదేశ్‌ను విభజించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటుచేసే దిశగా అడుగులు వేస్తోందా? కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సన్నిహితుల నుంచి అందుతున్న సంకేతాలు.. అవుననే చెప్తున్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే ఒక ఆలోచనకు వచ్చినట్టు సమాచారం. తెలంగాణపై రూట్‌మ్యాప్ సిద్ధం చేసే ప్రక్రియను తెరవెనుక ముమ్మరం చేసినట్లు కూడా చెప్తున్నారు. డిసెంబర్ 28వ తేదీన ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశం అనంతరం.. తెలంగాణపై నిర్ణయం నెల లోపు వెల్లడిస్తామని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే చేసిన ప్రకటనకు గడువు మరో పదిహేను రోజులే మిగిలింది. ఆ భేటీ తర్వాత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సమక్షంలో జరిగిన పార్టీ ముఖ్యుల సమావేశంలో రెండుసార్లు తెలంగాణ అంశంపైనే చర్చించారు.
రాష్ట్రంలో నెలకొన్న సంక్లిష్ట సమస్యల నేపథ్యంలో తెలంగాణపై అనేక ప్రతిపాదనలను వడపోసిన అనంతరం రాష్ట్ర విభజన తప్పదన్న ఆలోచనకు కాంగ్రెస్ అధిష్టానం వచ్చిందని చెప్తున్నారు. ఈ అంశంపై అధిష్టానం పెద్దల్లో భిన్నవాదనలు ఉన్నప్పటికీ.. చివరకు తెలంగాణ ఏర్పాటు చేయటమన్న ఆలోచన దిశగానే అడుగులు వేస్తోందన్న సంకేతాలు వెలువడ్డాయి. అయితే.. దీనికి చివరి దశలో ఎలాంటి రూపమిస్తారు? నిర్ణయం ఎప్పుడు ప్రకటిస్తారు? వంటి అంశాలను ఇంకా తేల్చాల్సి ఉంది. ఈ విషయంపై కాంగ్రెస్ కోర్ కమిటీ సభ్యులు ఇటీవలి కాలంలో నోరు మెదపటం లేదు. అంతర్గతంగా చర్చల విషయాలను రాష్ట్ర నేతలతో పంచుకోవటానికి ఇష్టపడటం లేదు. అయితే పరోక్షంగా వారు వెల్లడిస్తున్న విషయాలనుబట్టి.. తెలంగాణ ఏర్పాటు దిశగానే చర్యలు ఉండబోతున్నాయన్నది అర్థమవుతోందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. కేంద్రం తీసుకోబోయే నిర్ణయం తెలంగాణకు సానుకూలంగా ఉండబోతోందన్న సంకేతాలు ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డికి కూడా అందినట్లు సమాచారం. గత కొద్ది రోజులుగా రాష్ట్రంతో సంబంధాలున్న అనేక మంది ఏఐసీసీ ముఖ్యుల వ్యవహార శైలిలో కూడా స్పష్టమైన మార్పులు కనబడుతున్నాయని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. అయితే రాజకీయ వ్యూహంలో భాగంగానే ఇలాంటి సంకేతాలు ఇచ్చారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
బలమైన సంకేతాలు...
తెలంగాణ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో ఆ ప్రాంత నేతలు ఢిల్లీ పెద్దల ముందు నివేదించిన సందర్భాల్లో త్వరలోనే పరిష్కారం చూపుతామని, తొందరపడి నిర్ణయాలు తీసుకోబోమని మాత్రమే సమాధానం వచ్చేది. అదే సమయంలో సీమాంధ్ర నేతలు కలిసి రాష్ట్ర విభజనకు అంగీకరించేది లేదని, విభజిస్తే నష్టం జరుగుతుందని వివరించినప్పుడు అలాంటిదేమీ జరగదని స్పష్టంగా చెప్పేవారని గుర్తుచేస్తున్నారు. అయితే.. గత కొద్ది రోజులుగా ఢిల్లీ నాయకుల వైఖరిలో స్పష్టమైన తేడా కనపడుతోందని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అంటున్నారు. నాలుగు రోజుల కిందట కాంగ్రెస్ సమైక్యాంధ్ర నేతలు ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలను కలిసినప్పుడు.. రాష్ట్ర విభజన జరగదంటూ గతంలో మాట్లాడిన ధోరణిలో అంతే గట్టిగా ఈసారి చెప్పలేకపోయారని, వారి మాటలను బట్టి తమలోనూ అనుమానాలు బలపడ్డాయని సీమాంధ్ర నాయకుడొకరు చెప్పారు. ఇదిలావుండగా.. ఈ నెల 18 నుంచి 20 వరకు మూడు రోజులపాటు జైపూర్‌లో ఏఐసీసీ చింతన్ శిబిరం జరగనుంది. దీంట్లో చర్చించాల్సిన కీలకాంశాలపై ఏఐసీసీ నేతలు ఎజెండాను ఖరారు చేశారు. అందులో ప్రస్తుతానికి తెలంగాణ లేదు. అయినప్పటికీ చివరి నిమిషంలో దాన్ని చేర్చే అవకాశాలు లేకపోలేదని చెప్తున్నారు. జైపూర్‌లో తొలి రెండు రోజుల సమాలోచనల్లో తెలంగాణ అంశం చర్చకు రావచ్చని ఏఐసీసీ నేత ఒకరు తెలిపారు. ‘తెలంగాణపై సస్పెన్స్ ఇంకెంతో కాలం కొనసాగదు. తెలంగాణ అంశానికి సాధ్యమైనంత తొందరగా ఫుల్‌స్టాప్ పెట్టాలని సోనియాగాంధీ భావిస్తున్నారు. అందువల్ల చర్చకు రాదని చెప్పలేం’ అని ఆ నాయకుడు పేర్కొన్నారు.
సోనియా ముందు భిన్నవాదనలు
తెలంగాణకు సంబంధించి సోనియాగాంధీ సమక్షంలో జరిగిన సమాలోచనల్లో కాంగ్రెస్ కోర్ కమిటీ సభ్యులు భిన్నవాదనలు వినిపించినట్లు సమాచారం. ముఖ్యంగా రక్షణమంత్రి ఎ.కె.ఆంటోనీ రాష్ట్ర విభజనను పూర్తిగా వ్యతిరేకించినట్లు తెలిసింది. 2009 డిసెంబర్ 9న కీలక ప్రకటన చేసిన కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం రాష్ట్ర విభజనకు సానుకూలత వ్యక్తం చేసినట్లు చెప్తున్నారు. అయితే.. ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ మాత్రం.. రాష్ట్ర విభజనకు సుముఖత వ్యక్తం చేయలేదని సమాచారం. అలాగే.. కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే కూడా తన అభిప్రాయంపై స్పష్టత ఇవ్వలేదని, పార్టీ అధిష్టానం ఆలోచన మేరకు నడవాలన్నది ఆయన వైఖరిగా చెప్తున్నారు. ఈ సమావేశాల్లో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని సూచనలపైనే చర్చలు కొనసాగినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో పలువురు నేతలు రాహుల్‌గాంధీతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నట్లు సమాచారం.
ఇటు తెలంగాణ.. అటు రెండో ఎస్‌ఆర్‌సీ..!
తెలంగాణను ఏర్పాటు చేస్తే హైదరాబాద్‌ను దశాబ్ద కాలం పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగిస్తూ రాష్ట్రాన్ని విభజించటం, లేదా హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయటమన్న అంశాలపై దృష్టి సారించినట్లు విశ్వసనీయ సమాచారం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూనే.. దేశంలోని ఇతర ప్రాంతాల్లో ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్లపై రెండో ఎస్‌ఆర్‌సీ (రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్)ను వేయాలన్న ప్రతిపాదనను కూడా పరిశీలించారని చెప్తున్నారు. తెలంగాణ అంశాన్ని ప్రత్యేకంగా పరిగణించలేదని, మిగతా ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్లనూ పరిశీలిస్తున్నామని చెప్పేందుకు ఈ వ్యూహాన్ని అనుసరించాలన్న ఆలోచన వచ్చినట్లు సమాచారం. తెలంగాణకు ప్రత్యేక అభివృద్ధి మండలి, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచటం వంటి అనేక ప్రతిపాదనలపై చర్చోపచర్చల అనంతరం.. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. చివరకు తెలంగాణ అనుకూలంగా నిర్ణయం తీసుకోబోతున్నామన్న సంకేతాలను అధిష్టానం ఇచ్చిందన్న అభిప్రాయం కాంగ్రెస్‌లో వ్యక్తమవుతోంది. అయితే.. కాంగ్రెస్ పెద్దల ‘వ్యూహాత్మక ప్రణాళిక’లో భాగంగానే తెలంగాణకు సానుకూలంగా సంకేతాలు ఇస్తున్నారని భావిస్తున్న వారూ ఆ పార్టీలో ఉన్నారు.
ముమ్మరమైన చివరి యత్నాలు...
తెలంగాణపై చెప్పిన గడువు సమీపిస్తున్న నేపథ్యంలో కేంద్రంలో ఏం జరుగుతోంది? ఎలాంటి నిర్ణయం తీసుకో నున్నారు? అనే అంశాలపై ఆయా రాజకీయ పార్టీల్లో ఒకవైపు తీవ్రస్థాయి చర్చ సాగుతుండగా.. మరోవైపు అనుకూల ప్రతికూల వాదాలతో నేతలు తమ చివరి దశ ఒత్తిడి ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. తెలంగాణకు సానుకూల నిర్ణయం తీసుకోబోతున్నారని గత రెండు రోజులుగా కాంగ్రెస్ నేతలకు సంకేతాలు అందుతుండటంతో కాంగ్రెస్‌లో అలజడి మొదలైంది. తాజా సంకేతాల నేపథ్యంలోనే కాంగ్రెస్ సమైక్యాంధ్ర ప్రజాప్రతినిధుల ఫోరం ఈ నెల 17న సమావేశం ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. 18వ తేదీన జైపూర్‌లో ఏఐసీసీ చింతన్ శిబిరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఒక రోజు ముందే సమైక్యాంధ్ర నేతలతో సమావేశం నిర్వహించి అధిష్టానానికి గట్టి సంకేతాలు పంపాలని నిర్ణయించారు. మరోవైపు తాజా పరిణామాల్లో ఢిల్లీ తీసుకోబోయే నిర్ణయంపై సమైక్యాంధ్ర ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్ శైలజానాథ్ ఈ నెల 15న ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఇదిలావుంటే.. తాజా పరిణామాల నేపథ్యంలో కొందరు ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేయాలన్న ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది
(Source-saakshi)

No comments:
Post a Comment