సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన చేయరాదన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని, విభజించాల్సి వస్తే తాము రాయలసీమకు కూడా ప్రత్యేక రాష్ట్రం కావాలంటామని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి అన్నారు. ఆయన మంగళవారం పార్టీ కార్యాలయం వద్ద మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు స్పందిస్తూ పై విధంగా వ్యాఖ్యానించారు. ఈ అంశంపై పార్టీతో సంబంధం లేకుండా తాను మాట్లాడుతున్నానని ఆయన అన్నారు. విభజన నిర్ణయం జరిగితే రాజీనామాలు చేయడంతోపాటుగా అన్నివిధాలా అడ్డుకుంటామన్నారు.
అది ఆయన వ్యక్తిగతం: కె.కె.మహేందర్‌రెడ్డి
గురునాథరెడ్డి వ్యాఖ్యలపై పార్టీ సీజీసీ సభ్యుడు కె.కె.మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. అవి ఆయన వ్యక్తిగతం మాత్రమేనని, పార్టీ విధానం కాదని స్పష్టం చేశారు. మీడియా ప్రతినిధులు గురునాథరెడ్డి వ్యాఖ్యలను ఆయన దృష్టికి తేగా.. అందరి వాదనలు ముగిసి జడ్జి నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నపుడు ఇలాంటి చర్చ తగదని అన్నారు. అయినా పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు తావుండదన్నారు. పార్టీలో అన్నిప్రాంతాల నాయకులు కూర్చుని రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 కింద విభజన అధికారం కేంద్రానికే ఉందని, అన్ని ప్రాంతాలవారికి అన్యాయం జరక్కుండా నిర్ణయం తీసుకోవాలని అఖిలపక్షంలో సూచించామని.. దానికే అందరూ కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు. తాను పుట్టుకతో తెలంగాణవాదినని, అయితే ఒక పార్టీలో ఉన్నపుడు సమష్టి అభిప్రాయానికి కట్టుబడి ఉండాలన్నారు.
(Source-saakshi)

No comments:
Post a Comment