హైదరాబాద్: తెలంగాణపై జోరందుకున్న ఊహాగానాలతో రాష్ట్ర కాంగ్రెస్ నేతల మధ్య గత రెండురోజులుగా మాటల యుద్ధం ముదిరింది. తెలంగాణకు అనుకూలంగా పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోబోతోందని, ఈ మేరకు తమకు సంకేతాలున్నాయని ఈ ప్రాంత నేతలంటుండగా.. అలాంటిదేమీ లేదని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతారనే తమకు సమాచారం ఉందని సీమాంధ్ర నేతలు ఖండిస్తున్నారు. మంత్రులు శ్రీధర్‌బాబు, దానం నాగేందర్, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డిలు సోమవారం ఆర్టీసీ ఛైర్మన్ ఎం.సత్యనారాయణరావు 80వ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన నివాసానికి వె ళ్లారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం సానుకూల నిర్ణయం వెలువరించనుందని, దీనికి సంబంధించి ఈనెల 18న కీలక సమావేశం జరగనున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి వయలార్ రవి నుంచి తనకు సమాచారం ఉందని గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ రావడం ఖాయమని, సీమాంధ్రలో కూడా అధికశాతం మంది అనుకూలంగానే ఉన్నారని ఆయన చెప్పారు. కాంట్రాక్టులుచేసి డబ్బు సంపాదించిన నలుగురైదుగురు నాయకులు మాత్రమే వ్యతిరేకిస్తున్నారని అన్నారు. కాగా తెలంగాణ ఏర్పాటు ఖాయమన్న సంకేతాలు తమకు అందాయని దానం అన్నారు. పదేళ్లపాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచవచ్చని, త్వరలోనే దీనిపై ప్రకటన వస్తుందని చెప్పారు.
తెలంగాణపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకోనుందని, తమకు వ్యతిరేకంగా నియోజకవర్గాల్లో కార్యక్రమాలకు పిలుపునిచ్చిన వారికి సరైన సమాధానం చెబుతామని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ఎమ్మెల్సీ కేఆర్ ఆమోస్, మాజీ ఎమ్మెల్సీ కమలాకర్‌రావులు మాట్లాడుతూ.. సీమాంధ్రనేతలు కొందరు తమ ఆస్తులకు రక్షణ లేకుండా పోతుందని భయపడుతున్నట్లుగా ఉన్నారని, అలాంటి వారు ఆస్తుల వివరాలు చె బితే కేంద్ర బలగాలతో రక్షణ కల్పిస్తామని అన్నారు. ఈ ప్రకటనలపై మంత్రి గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటుపై ఎలాంటి సంకేతాలూ లేవని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతారన్న సమాచారం తమకు ఉందని తెలిపారు. రాష్ట్రాన్ని విభజిస్తే తామంతా పదవులకు రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. కేంద్రం రాష్ట్రాన్ని విభజించకుండా ఒత్తిడి తెచ్చేందుకు పార్టీలకు అతీతంగా సీమాంధ్ర నేతలంతా 17వ తేదీన భేటీ కానున్నట్లు ప్రకటించారు. తెలంగాణపై తమకెలాంటి సంకేతాలూ లేవని మంత్రి సాకే శైలజానాధ్ చెప్పారు.
రేపు సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేల భేటీ
తెలంగాణపై కేంద్రం, పార్టీ అధిష్టానం సాగిస్తున్న కసరత్తు కీలకదశకు చేరుకుంటున్న దశలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే ఒత్తిడి పెంచేందుకు సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు గురువారం హైదరాబాద్ మంత్రుల క్వార్టర్లలోని క్లబ్‌హౌస్‌లో భేటీ కావాలని నిర్ణయించారు. దీనికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యులు హాజరుకానున్నారు. ప్రత్యేక తెలంగాణపై ఇటీవల ఆప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు ఇదే వేదికగా భేటీ అయిన సంగతి తెలిసిందే. దానికి పోటీగా సీమాంధ్ర ప్రాంత మంత్రులు, ఇతర నేతలు సమావేశమై భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోవాలని నిర్ణయించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఈ వేదిక ద్వారా అధిష్టానాన్ని కోరనున్నామని సమైక్యాంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్ కూడా అయిన శైలజానాథ్ చెప్పారు
(Source-saakshi)

No comments:
Post a Comment