KIND ATTENTION - ALL BLOGGERS

DEAR FRIENDS, FROM 4.3.10 NIGHT, SOMEONE(SCOTLAND ADDRESS)HACKED MY E-MAIL gavinivn@gmail.com AND BEEN MIS-USING FOR WRONGFUL FINANCIAL GAIN. PLEASE DO NOT BELIEVE ANY STORY FROM THIS E-MAIL, IMPERSONATED BY HACKER IN THE NAME, GAVINI VENKATA NARAYANA, SEEKING FOR ANY HELP FINANCIAL OR OTHERWISE. THANKS.

Thursday, December 30, 2010

కేంద్ర హోం మంత్రికి నివేదిక సమర్పించిన శ్రీకృష్ణ కమిటీ!

 గురువారం, 30 డిసెంబర్ 2010( 15:06 IST )--ఆంధ్రప్రదేశ్ భవితవ్యాన్ని తేల్చే నివేదికను శ్రీకృష్ణ కమిటీ కేంద్ర హోం మంత్రి పి. చిదంబరానికి గురువారం సమర్పించింది. 600 పేజీలతో కూడిన నివేదికను శ్రీకృష్ణ కమిటీ సభ్యులు కేంద్ర మంత్రి పి. చిదంబరానికి అందజేశారు. ఐదుగుర సభ్యులతో కూడిన శ్రీకృష్ణ కమిటీ, 11 నెలల పాటు రాష్ట్రంలోని పలు అంశాలపై అభిప్రాయాలు సేకరించి రెండు భాగాలుగా నివేదిక సమర్పించింది.  డిసెంబర్ 31లోపు నివేదిక సమర్పిస్తామని చెప్పిన శ్రీకృష్ణ కమిటీ నిర్ణీత గడువులోపే గురువారం కేంద్రానికి అందజేసింది. రెండు భాగాలుగా అందజేసిన శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో రాష్ట్ర విభజన, సమైక్యాంధ్రతో కలిగే లాభనష్టాల గురించి వివరించినట్లు తెలుస్తోంది. కాగా, కమిటీ నివేదికపై కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం ప్రకటన జనవరి 6న చేసే అవకాశం ఉంది.
==============================
(source-MSN News)

No comments:

Post a Comment