KIND ATTENTION - ALL BLOGGERS

DEAR FRIENDS, FROM 4.3.10 NIGHT, SOMEONE(SCOTLAND ADDRESS)HACKED MY E-MAIL gavinivn@gmail.com AND BEEN MIS-USING FOR WRONGFUL FINANCIAL GAIN. PLEASE DO NOT BELIEVE ANY STORY FROM THIS E-MAIL, IMPERSONATED BY HACKER IN THE NAME, GAVINI VENKATA NARAYANA, SEEKING FOR ANY HELP FINANCIAL OR OTHERWISE. THANKS.

Sunday, December 26, 2010

నివేదికలో ఏమీ ఉండదని దుగ్గలే నాకు చెప్పారు: కేసీఆర్

 ఆదివారం, 26 డిసెంబర్ 2010( 17:42 IST )


జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ సమర్పించే నివేదికలో తెలంగాణకు అనుకూలంగా ఏమీ ఉండదనే విషయాన్ని ఆ కమిటీ సభ్యకార్యదర్శి వీకేదుగ్గలే స్వయంగా తనకు చెప్పారని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ఆయన ఆదివారం తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.
సంక్రాంతి పండుగ తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాన్నారు. శత్రువు మనల్ని దెబ్బతీసేందుకు కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నారని, వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాలన్నారు. ఇందుకోసం అన్ని పార్టీలను, అన్ని ఉద్యమ సంఘాలను కలుపుకుని ముందుకు సాగాలన్నారు.

రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను ప్రతి గడపలో చాటి చెప్పి గ్రామ సభల్లోనే తెలంగాణకు అనుకూలంగా తీర్మానాలు చేయిద్దామన్నారు. కమిటీ నివేదిక ఇవ్వకముందే తెలంగాణ జిల్లాల్లో భారీ సంఖ్యలో బలగాలను మొహరించడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. డిసెంబరు 31వ తేదీ తర్వాత తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులను ఎక్కడ కనబడితే అక్కడ నిలదీయాలన్నారు. తెలంగాణ తెచ్చేది మేమే.. ఇచ్చేది మేమే అని నిన్నటి వరకు ప్రచారం చేశారన్నారు. ఇపుడేమో సోమవారం నుంచి నిరాహారదీక్షలంటా.. అవసరమైతే మూకుమ్మడి రాజీనామాలంటా ఏవేవో కారుకూతలు కూస్తున్నారన్నారు.

ఈ రాజీనామాల నాటకంతో మరోయేడాది కాలం పొడంగించేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలే నాటకం ఆడుతున్నారన్నారు. వీరిని ఇకపై ప్రజలు నమ్మే ప్రసక్తే లేదన్నారు. ఏడాది క్రితమే వీరు రాజీనామాలు చేసివుంటే ఈ పాటికి రాష్ట్ర వచ్చి ఉండేదన్నారు. ఇకపోతే.. జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ వల్ల ఒరిగేది ఏమీ ఉండదన్నారు. ఈ విషయాన్ని దుగ్గల్ స్వయంగా తనకు చెప్పారన్నారు. కమిటీ నివేదికలో సమైక్యాంధ్రగా ఉంచాలని మాత్రమే ఇవ్వనున్నట్టు చెప్పారని కేసీఆర్ వెల్లడించారు. అందువల్ల సంక్రాంతి తర్వాత ఉద్యమాన్ని ఉధృతం చేసి, ఫిబ్రవరి నుంచి సహాయ నిరాకరణ చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
================================
(source-MSN News)

No comments:

Post a Comment