రాష్ట్ర ప్రజలతో పాటు రాజకీయ నేతలకు డిసెంబరు ఫీవర్ పట్టుకుంది. ముఖ్యంగా, పోలీసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. మరోవైపు.. అధికార కాంగ్రెస్ పార్టీకి 'ముందు నుయ్యి.. వెనుక గొయ్యి' అనే చందంగా మారింది. తెలంగాణ సమస్యతో పాటు జగన్ వ్యవహారం ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వాస్తవానికి తెలంగాణ సమస్యను పరిష్కరించేందుకు కొంత సమయం తీసుకునే వెసులుబాటు ఉంది. అయితే, జగన్ వ్యవహారంలో మాత్రం అది లేదనే చెప్పొచ్చు. అందుకే.. డిసెంబరు తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయోనని కాంగ్రెస్ సర్కారుకు గుబులు పట్టుకుంది. ఈ పరిస్థితుల్లో ఎలాంటి సమస్యలు ఉత్పన్నమైనప్పటికీ.. వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా కేంద్రం నుంచి అదనపు బలగాలను పంపాలని రాష్ట్రం కేంద్రాన్ని కోరింది. ఆ వెంటనే 50 కంపెనీల బలగాలను కేంద్రం రాష్ట్రానికి పంపింది. ఇందులో తెలంగాణలోని ప్రతి జిల్లాకు రెండేసి, సీమాంధ్రలోని జిల్లాలకు ఒక్కో కంపెనీ, రాజధాని హైదరాబాద్‌కు ఐదు కంపెనీల బలగాలను వినియోగించనున్నారు. డిసెంబరు తర్వాత రాష్ట్రంలో ఉత్పన్నమయ్యే పరిస్థితులను బట్టి అదనంగా మరికొన్ని కంపెనీల బలగాలను రాష్ట్రానికి పంపించేందుకు కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేసింది.
అదేసమయంలో జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఎలా ఉన్నా.. దాని ప్రభావం మరొక ప్రాంతంపై పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ మేరకు నిఘా వర్గాలు కూడా హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో అన్ని జిల్లాల పోలీసు యంత్రాలను డీజీపీ అరవిందరావు అప్రమత్తం చేశారు. వాస్తవానికి శ్రీ కృష్ణ కమిటీ నివేదికను ఖచ్చితంగా అమలుచేయాలన్న నిబంధన లేకపోయినప్పటికీ.. రాష్ట్ర ప్రజల అభిప్రాయాలు, మనోభావాలు అందులో పేర్కొనే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో నిర్ణయం తీసుకుంటే పార్టీ నష్టపోవడం ఖాయమన్న ఆందోళనతో కాంగ్రెస్ నాయకత్వం ఉన్నట్లు ఆ పార్టీ ఎంపీలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు వైఎస్.జగన్మోహన్ మాయలో రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులు పడిపోయాయి. వచ్చే యేడాది మార్చిలోపు జరిగే ఉపఎన్నికల్లో తన సత్తా చాటి 2014లో జరిగే ఫైనల్ ఎన్నికలకు సిద్ధమయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
వీటన్నింటినీ నుంచి తప్పించుకునేందుకు ఒక యేడాది పాటు రాష్ట్రపతి పాలన విధించడమే ఉత్తమన్న యోచనలో కాంగ్రెస్ అధినాయకత్వం ఉన్నట్టు సమాచారం. అధిష్టానం మనస్సులోని మాటను రుజువు చేసేలా అనకాపల్లి ఎంపీ సబ్బం హరి కూడా వ్యాఖ్యానించారు. డిసెంబరు తర్వాత రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టే అవకాశాలు ఉన్నట్టు అభిప్రాయపడ్డారు. ఇలా చేయడం వల్ల తెలంగాణ సమస్యను మరికొంతకాలం నాన్చడమే కాకుండా, ఉద్యమాన్ని అణిచివేసేందుకు దోహదపడుతుంది. దీనికితోడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న సంక్షోభం, ఎమ్మెల్యేల తిరుగుబాటు, ముఖ్యమంత్రి క్రియాశూన్యత, జగన్ తన పార్టీని చీల్చే అవకాశాలు, రాష్ట్ర ప్రతిపక్ష పార్టీలైన తెదేపా, ప్రరాపాలు మరింత బలపడే అవకాశం తదితర అంశాలపై అధిష్టానం విశ్లేషించింది. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారమార్గం కనుగొనాలంటే ఆరు నెలల పాటు రాష్ట్రపతి పాలన విధించాలని భావిస్తోంది.
=========================================
(source-MSN News)
The idea behind this blog is to educate/help/enlighten and not to create controversy or to incite. The opinions and views expressed on this blog are purely personal. Please be soft in your language, respect Copyrights and provide credits/links wherever possible.The blog team indemnifies itself of any legal issues that may arise out of any information/ views posted by anyone on the blog.
KIND ATTENTION - ALL BLOGGERS
DEAR FRIENDS, FROM 4.3.10 NIGHT, SOMEONE(SCOTLAND ADDRESS)HACKED MY E-MAIL gavinivn@gmail.com AND BEEN MIS-USING FOR WRONGFUL FINANCIAL GAIN. PLEASE DO NOT BELIEVE ANY STORY FROM THIS E-MAIL, IMPERSONATED BY HACKER IN THE NAME, GAVINI VENKATA NARAYANA, SEEKING FOR ANY HELP FINANCIAL OR OTHERWISE. THANKS.
No comments:
Post a Comment