ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్‌తో కేంద్ర పెట్రోలియం శాఖామంత్రి, తెలంగాణ ప్రాంత సీనియర్ నేత ఎస్.జైపాల్ రెడ్డి శుక్రవారం కలిశారు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య తెలంగాణ అంశంతో పాటు రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చ జరిగింది. తెలంగాణకు సమస్యకు సత్వర పరిష్కార మార్గం కనుగొనాలని చూసించినట్టు చెప్పారు. ఈ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సమస్యను త్వరగా పరిష్కరించాలని ప్రధానమంత్రిని కోరినట్టు చెప్పారు. అలాగే, హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదశ్ రాష్ట్రంలో నెలకొన్న అసాధారణ పరిస్థితులను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు.
అలాగే, తెలంగాణపై నా భావాలను, అంచలనాలను ప్రధానికి తెలియజేసినట్టు చెప్పారు. అయితే ప్రధానితో జరిగిన పూర్తి విషయాలను మీడియాకు వెల్లడించడం భావ్యం కాదన్నారు. ఏది ఏమైనా సమస్యకు సత్వర పరిష్కారం కనుగొనాలని కోరినట్టు చెప్పారు. అయితే, తెలంగాణ సమస్యకు ఒక్క ప్రధానమంత్రి మాత్రమే పరిష్కారం కనుగొనలేరని, కాంగ్రెస్ నాయకత్వ స్థాయిలోనూ, యూపీఏ భాగస్వామ్య పక్షాలు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. 14ఎఫ్ తొలగింపుపై అసెంబ్లీ తీర్మానాన్ని గౌరవించాలన్నారు.
ఇకపోతే.. తెలంగాణ అంశంలో కాంగ్రెస్ అధినాయకత్వ వైఖరి తనకు తెలియదన్నారు. ఈ విషయంపై హైకమాండ్ పెద్దలతో కలుసుకోవాల్సి ఉందన్నారు. తెలంగాణ, హైదరాబాద్ వాదిగా తన అభిప్రాయాలను వెల్లడించానన్నారు.
=====================================
(Source-MSN WEBDUNIA)
No comments:
Post a Comment