తెలంగాణా అంశంపై కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ అగ్నిపరీక్ష పెట్టబోతోంది. తెలంగాణా సావధాన తీర్మానం పేరిట తెలంగాణాపై గంటపాటు చర్చించబోతోంది. ఈ చర్చలో తెలంగాణాపై కాంగ్రెస్ వైఖరి ఏమిటన్నది ప్రజలకు తేటతెల్లం చేయాలని కంకణం కట్టుకుంది. తాము ప్రవేశపెట్టనున్న తీర్మానంలో చర్చించేందుకు శుక్రవారంనాడు తెలంగాణా ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు హాజరు కావాలని కోరింది. అయితే దీనిపై రాజీనామా చేసిన కాంగ్రెస్ ఎంపీల్లో విభిన్నమైన వాదనలు వినబడుతున్నాయి. సభలో ఇప్పటికే తాము తెలంగాణాకోసం చేయాల్సినవన్నీ చేశామనీ, ఇక ఇప్పుడు అధిష్టానంతోనే తమకు పని అని చెపుతున్నారు.
మరోవైపు తెలంగాణాపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీమాంధ్ర ప్రాంత ఎంపీలు ఆసక్తిని చూపారు. రేపు భాజపా తెలంగాణాపై చేసే చర్చలో భాజపా అనుసరిస్తున్న వైఖరిని దనుమాడాలని సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు సన్నద్ధమవుతున్నారు. ఇదిలావుంటే తెలంగాణా అంశంపై కాంగ్రెస్ - భాజపాలతోపాటు తృణమూల్ కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీ.. ఇలా ఇతర పార్టీలు కూడా వెల్లడించాల్సి ఉంటుంది. మొత్తమ్మీద కాంగ్రెస్ పార్టీకి రేపు పార్లమెంటులో ఊపిరాడని పరిస్థితి నెలకొనబోతోంది.
===========================
(Source - MSN WEB DUNIA)
No comments:
Post a Comment