మంగళవారం, 2 ఆగస్టు 2011( 11:23 IST )తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమస్య ఇంత జఠిలం కావడానికి ప్రధాన కారణంగా మన పార్టీ అధిష్టానమేనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ఎస్.జైపాల్ రెడ్డి విమర్శించారు. ఈ సమస్య పరిష్కారానికి ఏం చేస్తుందో కూడా ఒక క్యాబినెట్ మంత్రిగా తనకు కూడా తెలియడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉండేదన్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాలులో రాష్ట్ర విభజన అంశంపై సీమాంధ్ర మంత్రులతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఇప్పుడు చర్చలు జరగాల్సింది రాష్ట్ర విభజన మీద మాత్రమేనని సీమాంధ్ర మంత్రులతో ఆయన అన్నారు.
తెలంగాణ ప్రజాప్రతినిధులు రాజీనామా చేయడంతో ప్రజలు సంతృప్తి చెందడం లేదని, రాజీనామాలను ఆమోదింప జేసుకోవాలని పట్టుపడుతున్నారని ఆయన గుర్తు చేశారు. ముఖ్యంగా తాను హైదరాబాద్‌కు వెళ్లాలంటే భయ పడుతున్నట్టు చెప్పారు. తనను తెలంగాణ వ్యతిరేకిగా చిత్రీకరిస్తూ దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. అసలు.. పరిస్థితి ఇంత దాకా రావడానికి అధిష్టానమే కారణమని, అధిష్టానం సమస్య పరిష్కారానికి ఏం చేస్తుందో కేబినెట్ మంత్రినైనా తనకు కూడా తెలియడం లేదన్నారు. గతంలో ఓ స్పష్టత ఉండేదని, ఇప్పుడు ఆ స్పష్టత లేదని జైపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇదే పరిస్థితి మున్ముందు కొనసాగితే పరిస్థితి మరోలా ఉంటుందని ఆయన చెప్పారు.
(SOURCE-MSN NEWS)
No comments:
Post a Comment