జనగామ (వరంగల్), న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనపై సెప్టెంబర్‌లో ఒక నిర్ణయం వస్తుందని ఐటీ, దేవాదాయశాఖ మంత్రిపొన్నాల లక్ష్మయ్య ఆశాభావం వ్యక్తంచేశారు. జనగామలో మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ఎవరికీఅభ్యంతరాలు లేకుండా తెలంగాణ రాష్ట్ర విభజన జరపాలని కోర్‌కమిటీ చేసిన సూచనలకు సర్వత్రా ఆమోదం లభించిందని తెలిపారు.
రాష్ట్ర విభజన తర్వాత ప్రాంతాల హక్కుల పరిరక్షణ, నదీజలాల వినియోగంపై అనుమానాలు, భయాందోళనలకు తావులేకుండా అందరికీ ఆమోదయోగ్యమైన ప్రక్రియ కోసం చర్చలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కీలకమైన హైదరాబాద్ రాజధాని, నదీజలాల వినియోగం వంటి రెండు అంశాలపై కేంద్రం చర్చిస్తోందన్నారు. అధిష్టానంపై ఒత్తిడి ఒత్తిడి ఫలితంగానే 14ఎఫ్ రద్దుపై కేంద్రం కీలకమైన నిర్ణయాన్ని తీసుకుందన్నారు.
=================================
(source-saakshhi)
No comments:
Post a Comment