తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మొట్టమొదటి ద్రోహి రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావేనని, అందువల్ల ఆయన రాజీనామాను తక్షణం ఆమోదించాలని మల్కాజ్‌గిరి ఎంపీ సర్వే సత్యనారాయణ డిమాండ్ చేశారు. అంతేకాకుండా తనకు మంత్రి పదవి దక్కకుండా చేశాడని ఆరోపించారు. ఇందుకు కేంద్ర మంత్రి ఎస్.జైపాల్ రెడ్డి సాయం తీసుకున్నట్టు ధ్వజమెత్తారు. తెరాస అధినేత కే.చంద్రశేకర్ రావు, టిజాక్ ఛైర్మన్ కోడందరామ్‌ల ప్రోద్బలంతో టి కాంగ్రెస్ ఎంపీలతో రాజీనామాలు చేయించి వారిని బలిపశువులు చేశారని సర్వే ఫైర్ అయ్యారు. అందువల్ల కేకే రాజీనామాను ఆమోదిస్తే అన్నింటికీ పరిష్కార మార్గం లభిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.
దీనిపై ఆయన మాట్లాడుతూ టి కాంగ్రెస్ ఎంపీలు చేసిన రాజీనామాల వల్ల ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కాదన్నారు. గతంలో చేసినట్టుగానే పార్లమెంటు సమావేశాలను స్తంభింపజేసి ఉంటే బాగుండేదన్నారు. డిసెంబర్ తొమ్మిదే తేదీ కంటే డిసెంబర్ 23 ప్రకటనలోనే తెలంగాణపై స్పష్టమైన వాగ్దానం ఉందని సర్వే చెప్పుకొచ్చారు. తెలంగాణపై అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరాల్సి ఉందన్నారు. అపుడే రాష్ట్ర ఏర్పాటు సులభమవుతుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యపడక పోవచ్చన్నారు.
=============================
(source-MSN WEB DUNIA)
No comments:
Post a Comment