దేశంలో కొత్త రాష్ట్రాల ఏర్పాటు అశంలో కాంగ్రెస్ పార్టీ తన విధానాన్ని తేటతెల్లం చేసింది. చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై తమ పార్టీ విధానం రెండో ఎస్సార్సీయేనని, ఇందులో ఒక స్పష్టత ఉందని ఆ పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఆయన బుధవారం భోపాల్‌లో మీడియాతో మాట్లాడుతూ చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై రెండో ఎస్సార్సీ వేయాలన్నదే తమ విధానమని తేల్చి చెప్పారు. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించక ముందే ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఉత్తరప్రదేశ్‌లో కొత్తగా మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాయావతి ప్రధానికి రాసిన లేఖపై ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల వద్ద స్పందించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర విభజన చేయాలంటే దానికి ముందు రెండో ఎస్సార్సీ ఏర్పాటవుతుందని ఆయన అన్నారు.
రాష్ట్రాల విభజనపై తమ పార్టీ విధానం స్పష్టంగా ఉందని, రాష్ట్ర విభజనకు ముందు ఎస్సార్సీ వేయాలని తాము డిమాండ్ చేస్తామని ఆయన అన్నారు. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు ఎస్సార్సీ అత్యంత ప్రధానమైందని, కొత్త రాష్ట్రాలకు సమానమైన కేంద్ర ఆర్థిక సహాయం అంది అభివృద్ధికి దోహదం చేస్తుందని చెప్పుకొచ్చారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని బుందేల్‌ఖండ్, పూర్వాంచల్, పశ్చిమాంచల్ రాష్ట్రాలుగా విభజించాలని మాయావతి ప్రధానికి లేఖ రాసిన విషయం తెల్సిందే. దీనిపై దిగ్విజయ్ పై విధంగా స్పందించారు.
ఇదే అంశంపై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రషీద్ అల్వీ ఢిల్లీలో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు వ్యతిరేకం కాదన్నారు. ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలన్న మాయవతి డిమాండ్‌పై ఆయన స్పందిస్తూ.. రెండో ఎస్సార్సీయే చిన్న రాష్ట్రాల సమస్యకు పరిష్కారమని సమాధానం ఇచ్చారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై రెండో ఎస్సార్సీని వేయాలని కేంద్రాన్ని కోరుతున్నామని తెలిపారు.
అయితే, తెలంగాణ అంశం చాలా సున్నితమైందని, దానిపై తమ పార్టీకి చెందిన ఆ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ గులాం నబీ ఆజాద్ చూసుకుంటారని చెప్పారు.

(Source-MSN News)
No comments:
Post a Comment