KIND ATTENTION - ALL BLOGGERS

DEAR FRIENDS, FROM 4.3.10 NIGHT, SOMEONE(SCOTLAND ADDRESS)HACKED MY E-MAIL gavinivn@gmail.com AND BEEN MIS-USING FOR WRONGFUL FINANCIAL GAIN. PLEASE DO NOT BELIEVE ANY STORY FROM THIS E-MAIL, IMPERSONATED BY HACKER IN THE NAME, GAVINI VENKATA NARAYANA, SEEKING FOR ANY HELP FINANCIAL OR OTHERWISE. THANKS.

Sunday, January 16, 2011

26లోపు తెలంగాణపై అఖిలపక్షం ఏర్పాటు: కాంగ్రెస్ యోచన

గణతంత్ర దినోత్సవానికి ముందే తెలంగాణపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అఖిలపక్షానికి ముందే తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులతో ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ మరో రెండు రోజుల్లో సమావేశమయ్యే అవకాశం ఉందని సమాచారం. ప్రత్యేక తెలంగాణ విషయంలో తమ పార్టీ నేతల నిర్ణయాన్ని తీసుకున్న తర్వాతే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. శ్రీ కృష్ణ కమిటీ తన నివేదికలో ఆరు పాయింట్లు సూచించిన నేపథ్యంలో వారు తెలంగాణ ప్రకటించడమో లేదు తెలంగాణకు రాజ్యాంగబద్ద రక్షణ కల్పించటమో ఏదో నిర్ణయం ఈ నెల 26లోపు తీసుకొని అఖిలపక్షాన్ని మరోసారి ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. మొత్తానికి తెలంగాణ అంశాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేదించాలని చూస్తోంది.
=======================================
ప్రజాప్రతినిధులు రాజీనామా చేస్తే తెలంగాణ ఎందుకు రాదు!?


తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధులు రాజీనామా చేస్తే తెలంగాణ వస్తుందని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు
కె. చంద్రశేఖరరావు అన్నారు. తెలంగాణాకు శాపం ఈ ప్రాంతం నేతలేనని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం రాజీనామాలు చేయమంటే కొందరు ప్రజాప్రతినిధులు ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణలోని మాజీ సైనికుల సేవను వినియోగించుకుంటామని కేసీఆర్ పేర్కొన్నారు.

1956 నుంచి తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధుల వల్లే తెలంగాణ రాలేదన్నారు. మరోవైపు ప్రజా  ప్రతినిధులు ఎవరైనా పదవులకు ఆశపడి తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేస్తే ప్రజలు బట్టలూడదీసి కొడతారని కాంగ్రెస్ ఎంపీ మధుయాష్కీ తెలిపారు. కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం తెలంగాణపై వెనక్కి తగ్గిన రోజున తెలంగాణవాదులంతా జెండాలు, అజెండాలు పక్కనబెట్టి పోరాడాలని నిర్ణయించినట్టు యాష్కీ చెప్పారు.
========================================
తెలంగాణ కోసం సోనియా కాళ్లు పట్టుకున్నా: అంజన్ కుమార్



తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ తెలంగాణ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ సంక్రాంతి సందర్భంగా బంపర్ ఆఫర్ ఇచ్చారు. తనకు కేంద్ర మంత్రి పదవి ఇప్పిస్తే చిటికెలో తెలంగాణ తెస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తెలంగాణ వాదినేనని, తెలంగాణకు పూర్తి మద్దతిస్తానని అంజన్ కుమార్ వ్యాఖ్యానించారు. ప్రత్యేక తెలంగాణ కోసం యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ కాళ్లు పట్టుకున్నానని అంజన్ కుమార్ తెలిపారు. తెలంగాణ కోసం పార్లమెంట్‌లో తానొక్కడినే మాట్లాడానని ఆయన అన్నారు. తెలంగాణ కోసం పార్లమెంట్‌లో గట్టిగా గళం విప్పిన తనకు తెలంగాణా కంటే మంత్రి పదవి ముఖ్యం అని అంజన్ కుమార్ తెలిపారు. మంత్రి పదవితోనే తెలంగాణ సాధించుకుంటామని చెప్పారు. హైదరాబాద్, తెలంగాణకు మద్దతు ప్రకటించాలని ఎంపీ అంజన్ కుమార్‌ను తెలంగాణ ఉద్యోగ జేఏసీ నేతలు కలిసారు.
ఈ సందర్భంగా అంజన్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి పదవులతో కేసీఆర్, జైపాల్ రెడ్డి కోట్లు సంపాదించారని ధ్వజమెత్తారు. ఒక్కో కుటుంబానికి మూడేసి పదవులా, పదవులు వారికి బాధ్యతలు నాకా అని అంజన్ కుమార్ ప్రశ్నించారు. ఇంకా బడుగు బలహీన వర్గాల వారికి పదవులు ఇవ్వరా అని ఈ సందర్భంగా అంజన్ కుమార్ నిలదీశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఎప్పుడో తెలంగాణ ఇచ్చేశారు. దానిని నిలుపుకునే సత్తా ఉద్యమ నేతలకు లేదు. అందుకే మంత్రి పదవి ముఖ్యమని అంజన్ కుమార్ వెల్లడించారు.
===================================
(source-MSN News)

No comments:

Post a Comment