హైదరాబాద్ : విపక్షాల నిరసనల మధ్యే శాసనసభ సమావేశాలు నాలుగోరోజు ప్రారంభం అయ్యాయి విపక్షాలు మంగళవారం అసెంబ్లీలో పలు అంశాంలపై వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ ఎత్తివేత, అరెస్ట్ అయిన విద్యార్థుల విడుదలపై టీఆర్‌ఎస్, పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని బీజేపీ, సీపీఐ, తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని సీపీఎం వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి.
విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు.
దీంతో టీఆర్‌ఎస్, తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు సభలో తెలంగాణ తీర్మానం చేయాలంటూ నినాదాలు చేశారు. సభ సజావుగా కొనసాగేందుకు సహకరించాలని డిప్యూటీ స్పీకర్ విజ్ఞప్తి చేశారు. ప్రశ్నోత్తరాల సమయం చేపట్టాలని ఆయన కోరారు. అయినా విపక్ష సభ్యుల తమ పట్టు వీడలేదు.
(source-saakshi)

No comments:
Post a Comment