ప్రధాన మంత్రితెలంగాణ సమస్యపై దేశ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఎట్టకేలకు నోరు విప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు రాజీనామాలు చేసిన నేపథ్యంలో తెలంగాణ సమస్యను తమ ప్రభుత్వం అధిగమిస్తుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ తెలంగాణ ప్రాంతానికి చెందిన అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు రాజీనామా చేసి పోరుబాట పట్టిన విషయం తెల్సిందే.
రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ ని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఈ రోజు కలిశారు. పార్లమెంటు సమావేశాలపై వారు చర్చించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అవినీతి, తెలంగాణ, రైతు సమస్యలు వంటి ఎన్నో అంశాలపై ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని భావిస్తున్న నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగాలని ఆశించారు. అలాగే లోక్‌పాల్ బిల్లుపై పార్లమెంట్ తగిన నిర్ణయం తీసుకుంటుందన్నారు.
(source-MSN Webdunia)
No comments:
Post a Comment