ఆదివారం, 24 జులై 2011( 18:55 IST )
రాష్ట్ర శాసనసభ స్పీకర్ తెలంగాణా ప్రజాప్రతినిధుల రాజీనామాలన్నిటినీ మూకుమ్మడిగా తిరస్కరించిన అనంతరం మంత్రి జానారెడ్డి ఇంట్లో టి.కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. భవిష్యత్‌లో ఎటువంటి కార్యచరణ అవలంభించాలన్నదానిపై మంతనాలు సాగించారు. తెలంగాణా కాంగ్రెస్ నేతల సమావేశానికి తొలిసారిగా రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు హాజరయ్యారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ... సీమాంధ్రులకు హైదరాబాద్ సిటీ అంటే ఎంతో మోజనీ, మరీ ముఖ్యంగా హైటెక్ సిటీ అంటే వాళ్లకు చెప్పలేనంత అభిమానమని అన్నారు. సహజంగానే ఇంత అభివృద్ధి చేసిన తర్వాత ఒక్కసారిగా వెళ్లమంటే వెళ్లిపోవడం ఎవరి వల్లా కాదనీ, కనుక ఓ పదేళ్లపాటు హైదరాబాద్ నగరాన్ని ఉమ్మడి రాజధానిగా చేసి ఆ తర్వాత హైదరాబాద్‌ను వదిలేయాలని చెబితే సరిపోతుందన్నారు.
ఏలాగూ అప్పట్లోగా సీమాంధ్ర రాజధాని అభివృద్ధి చెందుతుంది కనుక నగరాన్ని వదిలేయడానికి వాళ్లు కూడా సిద్ధంగానే ఉంటారని అభిప్రాయపడ్డారు. ఇదే అభిప్రాయాన్ని ఎంపీ వివేక్ కూడా వ్యక్తపరిచారు. అయితే మిగిలిన నేతలు మాత్రం దీనిపై ఎటువంటి స్పందనను తెలియజేయలేదు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు ఇన్‌ఛార్జి గులాంనబీ ఆజాద్‌తో మాట్లాడిన తర్వాత ఏదైనా చెపుతామని వెల్లడించారు.
===========================
(source-webdunia msn)
No comments:
Post a Comment