ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అంశంపై తుది నిర్ణయం తీసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వానికి కొంత సమయం కావాలని కేంద్ర హోం మంత్రి చిదంబరం అన్నారు. అలాగే, తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా ఓపిక పట్టాలని ఆయన కోరారు.
మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అంశం అత్యంత సున్నితమైనది మాత్రమే కాకుండా భావోద్వేగంతో కూడుగున్నదిగా పేర్కొన్నారు. అందువల్ల ఇది రాత్రికి రాత్రి తేలే అంశం కాదన్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం కొంత సమయంపడుతుందని, అప్పటి వరకు ప్రజలు ఓపికపడుతూ, హింసకు తావులేకుండా, శాంతియుతంగా ఉండాలన్నారు.
తెలంగాణ అంశంపై తేల్చేందుకు జస్టీస్ శ్రీకృష్ణ కమిటిని ఏర్పాటు చేశామని గుర్తు చేసిన చిదంబరం.. ఈ నివేదికను ప్రస్తుతం నిశితంగా క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నట్టు చెప్పారు. ఈ నివేదికపై రాజకీయ పార్టీల స్పందన కోసం వేసిచూస్తున్నట్లు తెలిపారు. స్పందన వచ్చాక నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇకపోతే.. ప్రతిపక్ష నేతలతో మాట్లాడిన తర్వాతే తెలంగాణ అంశంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ తేదీని మాత్రం ఆయన వెల్లడించలేదు. అదేసమయంలో ఈ సమావేశానికి ఎనిమిది ప్రధాన రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరవుతారని ఆశిస్తున్నట్టు చెప్పారు.
==============================
(source-MSN News)

No comments:
Post a Comment