రాష్ట్ర విభజనపై కేంద్రం త్వరలోనే ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ చేసిన ఆరో సిఫార్సుతో పాటు మరో ప్రతిపాదనను సీమాంధ్ర ఎంపీలు చేశారు. ఈ రెండింటిలో ఒకదాన్ని ఐదు రాష్ట్రా అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ సిఫార్సు మేరకు.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి, తెలంగాణకు ప్రాంతీయ అభివృద్ధి మండళ్ళను ఏర్పాటు చేయాలన్నది ఆరో ప్రతిపాదనగా ఉంది. అయితే, దీనికి తెలంగాణ ప్రాంత నేతలు సమ్మతించడం లేదు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ రాష్ట్రం కావాలని పట్టుబడుతుండగా, దీనికి సీమాంధ్ర నేతలు ససేమిరా అంటున్నారు.
ఈ నేపథ్యంలో అందరికీ ఆమోదయోగ్యమైన ప్రతిపాదనను సీమాంధ్ర ఎంపీలు తెరవెనుక చేసినట్టు సమాచారం. ఇటీవల ప్రధానితో సమావేశమైన వీరు ఈ ప్రతిపాదన చేయగా, దానికి ప్రధానమంత్రి సైతం జైకొట్టినట్టు లోగుట్టు. హైదరాబాద్ జంటనగరాలను ఉమ్మడి రాజధానిగా ఉంచి రాష్ట్ర విభజన చేయాలన్నది ఈ ప్రతిపాదన ముఖ్యాంశంగా ఉంది. అయితే, ఒకరిద్దరు సీమాంధ్ర ఎంపీలు మాత్రం వ్యతిరేకిస్తుండగా, తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పెక్కు మంది ఎంపీలు సమ్మతించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించటంతో పాటు తెలంగాణా సీమాంధ్ర రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా ఏర్పాటు చేసుకోవాలనే ప్రతిపాదనపై తొలుత చర్చలు జరిపారు.
హైదరాబాద్‌ను యూటీ చేసేందుకు తెలంగాణకు చెందిన పలువురు ఎంపీలు అంగీరించక పోవడంతో ఉమ్మడి రాజధానిగా చేయాలని సిఫార్సు చేసినట్టు సమాచారం. మొత్తం మీద మే నెలలో రాష్ట్ర విభజన సమస్యపై స్పష్టమైన నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
=========================
హైదరాబాద్‌ను ఉమ్మడిగా చేస్తే సమస్యకు చెక్: జయేంద్ర శుక్రవారం, 7 జనవరి 2011
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ఒక పరిష్కార మార్గాన్ని చూపించారు. చారిత్రాత్మక నేపథ్యం ఉన్న హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా చేసి రాష్ట్రాన్ని రెండుగా విభజిస్తే సరిపోతుందన్నారు. ఆయన శుక్రవారం గుంటూరులో మాట్లాడుతూ రాష్ట్రాన్ని రెండుగా ముక్కలు చేయాలని కేంద్ర తుది నిర్ణయం తీసుకుంటే పనిలోపనిగా హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా చేయాలని సూచించారు. గతంలో సమైక్యాంధ్రగానే రాష్ట్రం ఉండాలని కోరుకుంటున్నట్టు ప్రకటించి వివాదాస్పదంగా మారిన జయేంద్ర సరస్వతి ఇప్పుడు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా చేయాలంటూ సూచించడం గమనార్హం. ఇకపోతే. అయోధ్యలో రామాలయ మందిర నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందన్నారు. రాజకీయ కారణాల వల్లే ఈ ఆలయ నిర్మాణంలో జాప్యం నెలకొందన్నారు. అయితే రామాలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నది దేశంలో మెజార్టీ ప్రజల ఆకాంక్షగా చెప్పుకొచ్చారు. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో మాజీ మంత్రి కేవలం ఒక్క రాజానే అక్రమాలకు పాల్పడలేదని, దీనివెనుక అనేక మంది హస్తం ఉందన్నారు.
=================================
(source-MSN News)
No comments:
Post a Comment