తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సకలజనులసమ్మె 17వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. దీంతో శుక్రవారం కేసీఆర్ బృందం హస్తినకు వెళ్లనుంది.
ఢిల్లీలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ గులాం నబీ ఆజాద్‌తో భేటీలో భాగంగా తమ అభిప్రాయాలను కేసీఆర్ బృందం తెలియజేయనున్నట్లు సమాచారం. ఇంకా శుక్రవారం సాయంత్రం యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీకి గులాం నబీ ఆజాద్ తెలంగాణపై నివేదిక సమర్పించనున్నారు.
ఈ నివేదిక తమకు సానుకూలంగా ఉంటుందని కేసీఆర్ బృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అయితే సోనియాకు సమర్పించే రిపోర్ట్ లీక్ కాకుండా ఆజాద్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
రిపోర్ట్‌లోని వివరాలు బయటపడకుండా నివేదికను ఆజాద్ గోప్యంగా ఉంచారు. తద్వారా ఆజాద్ నివేదికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే తెలంగాణ, రాయలసీమ ప్రాంత నేతలతో సమావేశమైన ఆజాద్ రాష్ట్ర విభజన ప్రక్రియకు సంబంధించి అన్ని ప్రాంతాల నేతల అభిప్రాయాలను సేకరించారు. ఆజాద్ నివేదిక సమర్పించనున్న నేపథ్యంలో పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, టి. కాంగ్రెస్ నేతలు ఢిల్లీలోనే ఉన్నారు.
(Source-MSN News)

No comments:
Post a Comment