Arige Saidulu Mudhiraj shared Ramesh Posu's photo.
షుగర్ వ్యాధితో బాధపడుతున్నవారికి శుభవార్త. ప్రతి ఒక్కరూ షేర్ చెయ్యండి.
షుగర్ వ్యాధిని తగ్గించుకునే సరికొత్త మార్గం మీ ముందుకు వచ్చింది. దీని కోసం డాక్టర్ల దగ్గరకు పరుగులు తీయక్కర్లేదు.. వేలాది రూపాయలు ఖర్చు పెట్టి మందులు వాడాల్సిన పని అంతకన్నా లేదు.. జస్ట్. . వారానికి నాలుగు గుడ్లు తింటే చాలు.. మధుమేహం .. మన మాట వింటుందంటున్నారు పరిశోధకులు.
6 కోట్ల 50 లక్షలు.. ఇది ఓ రాష్ట్రం జనాభా కాదు.. దేశంలో డయాబెటిస్ రోగుల సంఖ్య. మధుమేహం… ఒకప్పుడు పెద్దల్లోనే ఎక్కువగా కనిపించే ఈ సమస్య.. ఇప్పుడు పిల్లల్నీ పట్టి పీడిస్తోంది. డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. మారుతున్న ఆహారపు అలవాట్లు.. జనాన్ని డయాబెటిస్ బారిన పడేలా చేస్తున్నాయి. డయాబెటిస్ చికిత్స తీసుకోవడంతో పాటు.. ఆహారపు అలవాట్లను మార్చుకోవడం, కొన్ని రకాల యోగాసనాలు వేయడం వల్లా మధుమేహ నియంత్రణ సాధ్యమవుతుందంటున్నారు డాక్టర్లు.
డయాబెటిస్ రెండు రకాలు.. టైప్ వన్.. టైప్ టు.. ప్రపంచంలో 95 శాతం మంది టైప్ టు డయాబెటిస్ తోనే బాధపడుతున్నారు. వీరి శరీరానికి సరిపడినంత ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడం వల్లో.. లేదంటే అధికంగా ఉత్పత్తి కావడం వల్లో.. ఈ టైప్ టు డయాబెటిస్ సోకుతుంది. దీనివల్ల గ్లూకోజ్ రక్తం నుంచి శరీరంలోని కణాలకు అందదు. ఫలితంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగిపోతుంది.
మధుమేహం నియంత్రణకు మహామంత్రం. వారానికి నాలుగు గుడ్లు తింటే చాలు అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రియన్ లో ప్రచురితమైన ఓ పరిశోధన… వారానికి నాలుగు గుడ్లు తింటే.. మధుమేహ నియంత్రణ సాధ్యమే అంటోంది. గుడ్లలో కొలస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. వారానికి నాలుగు కన్నా ఎక్కువ గుడ్లు తినకూడదన్న అభిప్రాయం గతంలో ఉండేది. కానీ, అందులో ఉన్న కొవ్వు మన శరీరానికి మంచిదేనంటున్నారు పరిశోధకులు. ముఖ్యంగా టైప్ టు మధుమేహంతో బాధపడేవారు గుడ్డును తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ సమతుల్యంగా ఉంటుందని గుర్తించారు. ఈస్ట్రన్ ఫిన్ లాండ్ యూనివర్సిటీలో 2332 మందిపై 19 ఏళ్లపాటు ఈ పరిశోధన సాగింది. వారానికి ఒక గుడ్డు తిన్న వారికంటే.. నాలుగు గుడ్లు తిన్నవారిలో… 37 శాతం మందికి డయాబెటిస్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు ఈ రీసెర్చ్ లో తేలింది.
(Source: via fb a/c / American Journal of Clinical Nutrition)
No comments:
Post a Comment