తెలంగాణ బిల్లుకు లోక్ సభ ఆమోదం
Sakshi | Updated: February 18, 2014 16:35 (IST)
న్యూఢిల్లీ: ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)ను లోక్ సభ ఆమోదించింది. బిల్లును ఆమోదించినట్లు లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ ప్రకటించారు. సీమాంధ్ర సభ్యుల గందరగోళం మధ్య మూజువాణి ఓటు ద్వారా ఈ తంతును ముగించారు. రాష్ట్ర విభజనకు సంబంధించిన అత్యంత కీలకమైన ఈ బిల్లుపై సభలో 23 నిమిషాలు మాత్రమే చర్చ జరిగింది. బిజెపి మద్దతుతో సభలో బిల్లుకు ఆమోదం లభించింది. బిల్లు సవరణలపై సభలో ఓటింగ్ జరుగుతోంది.
బిల్లుపై కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, జైపాల్ రెడ్డి, ప్రతిపక్ష బిజెపి నేత సుష్మాస్వరాజ్ మాట్లాడారు. సుష్మాస్వరాజ్ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. బిల్లు ఆమోదించే సమయంలో ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, యుపిఏ చైర్ పర్స్ సోనియా గాంధీ సభలోనే ఉన్నారు.
తెలంగాణ బిల్లును తొలుత హొం మంత్రి షిండే సభలో ప్రవేశపెట్టారు. సీమాంధ్రకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇస్తామని ప్రకటించారు. ఆ తరువాత ప్రతిపక్షనేతగా సుష్మాస్వరాజ్ బిల్లుపై మాట్లాడారు. ఆమె పది నిమిషాలసేపు మాత్రమే మాట్లాడారు. ఆ తరువాత జైపాల్ రెడ్డి మాట్లాడారు. అనంతరం మూజువాణి ఓటుతో బిల్లుకు ఆమోదం తెలిపారు. బీజేపీ మద్దతు లభించడంతో బిల్లు ఆమోదం పొందడం సులువైపోయింది. విపక్షాల నిరసనలను పట్టించుకోకుండానే బిల్లుకు ఆమోద ముద్ర వేశారు. బిల్లుపై కాంగ్రెస్ పార్టీ 37 సవరణలు, బిజెపి 33 సవరణలు సూచించాయి.
తొలుత సీమాంధ్ర ఎంపీల లోక్ సభ వెల్ లోకి వెళ్లి ఆందోళన చేశారు. సిపిఎం, శివసేన, బిజెడి ఎంపీలు కూడా వెల్లోకి దూసుకెళ్లారు. పెద్దసంఖ్యలో సభలోకి మార్షల్స్ ప్రవేశించారు. లోక్‌సభ గ్యాలరీలు, ద్వారాలు మూసివేశారు. లోక్ సభలో బిల్లు ఆమోదించే ముందు వ్యూహాత్మకంగా లోక్ సభ ఛానల్ ప్రసారాలను నిలిపివేశారు. స్పీకర్ మీరాకుమార్ దేశాల మేరకే ప్రసారాలు నిలిపివేశారు. సవరణలు జరుగుతుండగానే సోనియా సభ నుంచి వెళ్లి వాకౌట్ చేశారు.
రేపు లేక ఎల్లుండ ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెడతారు. రాజ్యసభలో ఆమోదం పొందడం లాంఛనమేనని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

(Source-saakshi)
No comments:
Post a Comment