శుక్రవారం, 5 ఆగస్టు 2011( 16:18 IST )
తెలంగాణా సమస్యపై పార్లమెంటులో ప్రసంగిస్తూ కేంద్ర హోంమంత్రి పి. చిదంబరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గురించి ప్రస్తావన చేశారు. తెలంగాణాపై మూడు పార్టీలు మాత్రమే స్పష్టమైన వైఖరిని ప్రదర్శించాయని చెపుతూ మిగిలిన పార్టీలు ఏకాభిప్రాయానికి రాలేకపోయాయన్నారు. కొత్తగా స్థాపించబడ్డ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం తెలంగాణాపై తన అభిప్రాయం ఏంటో ఇంతవరకూ చెప్పలేదని చిదంబరం పేర్కొన్నారు. ఈ ప్రకటనతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కూడా తెలంగాణా సమస్యలోకి లాగేశారు.
ఇటీవల ప్లీనరీ సమావేశాల్లో జగన్ మాట్లాడుతూ.. తమ పార్టీ తెలంగాణా సెంటిమెంటును గౌరవిస్తుందని చెప్పారు. దీనర్థం తెలంగాణాకు అనుకూలమా..? లేదా వ్యతిరేకమా..? అనే చర్చ మొదలైంది. కొండా సురేఖలాంటి నాయకులు జగన్ ప్రకటన తెలంగాణాకు అనుకూలమైనదే అంటే సీమాంధ్రకు చెందినవారు మాత్రం గౌరవిస్తామని అంటే తెలంగాణా రాష్ట్రాన్ని ఇవ్వమని అర్థమా..? అని ప్రశ్నిస్తున్నారు. వీళ్ల వాదనలు ఎలా ఉన్నా కేంద్రహోంమంత్రి మాత్రం తెలంగాణాపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఖరిని కోరుతున్నారు. మరి జగన్ తెలంగాణాపై తన స్టాండ్ ఏంటో వెల్లడిస్తారా...? లేదంటే పాతపాటే పాడుతారా..?
================================
(source-MSN WEB DUNIA)
No comments:
Post a Comment