KIND ATTENTION - ALL BLOGGERS

DEAR FRIENDS, FROM 4.3.10 NIGHT, SOMEONE(SCOTLAND ADDRESS)HACKED MY E-MAIL gavinivn@gmail.com AND BEEN MIS-USING FOR WRONGFUL FINANCIAL GAIN. PLEASE DO NOT BELIEVE ANY STORY FROM THIS E-MAIL, IMPERSONATED BY HACKER IN THE NAME, GAVINI VENKATA NARAYANA, SEEKING FOR ANY HELP FINANCIAL OR OTHERWISE. THANKS.

Wednesday, August 24, 2011

‘సెప్టెంబర్‌లో తెలంగాణపై నిర్ణయం’

జనగామ (వరంగల్), న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనపై సెప్టెంబర్‌లో ఒక నిర్ణయం వస్తుందని ఐటీ, దేవాదాయశాఖ మంత్రిపొన్నాల లక్ష్మయ్య ఆశాభావం వ్యక్తంచేశారు. జనగామలో మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ఎవరికీఅభ్యంతరాలు లేకుండా తెలంగాణ రాష్ట్ర విభజన జరపాలని కోర్‌కమిటీ చేసిన సూచనలకు సర్వత్రా ఆమోదం లభించిందని తెలిపారు.
రాష్ట్ర విభజన తర్వాత ప్రాంతాల హక్కుల పరిరక్షణ, నదీజలాల వినియోగంపై అనుమానాలు, భయాందోళనలకు తావులేకుండా అందరికీ ఆమోదయోగ్యమైన ప్రక్రియ కోసం చర్చలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కీలకమైన హైదరాబాద్ రాజధాని, నదీజలాల వినియోగం వంటి రెండు అంశాలపై కేంద్రం చర్చిస్తోందన్నారు. అధిష్టానంపై ఒత్తిడి ఒత్తిడి ఫలితంగానే 14ఎఫ్ రద్దుపై కేంద్రం కీలకమైన నిర్ణయాన్ని తీసుకుందన్నారు.
=================================

(source-saakshhi)

(source-saakshi)

Monday, August 22, 2011

(source-andhrajyothi)
(sourcce-saakshi)

(source-saakshi)


(source-saakshi)

Friday, August 12, 2011

(Source-andhra jyothi)

14 ఎఫ్ రద్దుపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న సీమాంధ్ర నేతలు!

శుక్రవారం, 12 ఆగస్టు 2011( 18:38 IST )రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను ఫ్రీజోన్‌గా ఉంచే 14 ఎఫ్ నిబంధనను తొలగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయడాన్ని నిరసిస్తూ సుప్రీంకోర్టుకు రిట్ పిటీషన్ దాఖలు చేయనున్నట్టు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన రాజకీయ నేతలు ప్రకటించారు. అలాగే, 14 ఎఫ్ రద్దును వ్యతిరేకిస్తూ సీమాంధ్ర విద్యార్థి జేఏసీ శుక్రవారం నుంచి విశాఖపట్టణంలో ఆమరణ నిరాహార దీక్షకు దిగింది. విశాఖ నగర కార్పోరేషన్ భవనం ఎదుట ఉన్న గాంధీ విగ్రహం దగ్గర విద్యార్థులు దీక్షకు కూర్చొన్నారు. ఈ సందర్భంగా వారు కేంద్ర హోంమంత్రి చిదంబరం దిష్టిబొమ్మను దహనం చేశారు. దీనిపై జేఏసీ కన్వీనర్ కె.శివాజీ మాట్లాడుతూ 14 ఎఫ్‌ను రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. పార్లమెంట్ సమావేశాల తర్వాత సీమాంధ్ర ప్రజాప్రతినిధుల నివాసాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు ఎంపీలపై ఒత్తిడి తెస్తామని వెల్లడించారు. అలాగే, మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్ మాట్లాడుతూ 14 ఎఫ్ తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని, దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్టు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల సీమాంధ్ర ప్రాంతానికి చెందిన విద్యార్థులు ఏ విధంగా నష్టపోతారో.. అదే విధంగా తెలంగాణలోని కొన్ని జిల్లాలకు చెందిన విద్యార్థులు నష్టపోతారన్నారు. అంతేకాకుండా, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసే అధికారం కేంద్రానికి లేదన్నారు. ఒక్క పార్లమెంట్‌కు మాత్రమే ఉందన్నారు. అందువల్ల దీనిపై మళ్లీ సుప్రీంకోర్టు తలుపులు తట్టనున్నట్టు ఆయన తెలిపారు.
==========================================
14 ఎఫ్‌పై సీమాంధ్ర నేతలు రాద్ధాంతం చేయొద్దు: పొన్నం

14 ఎఫ్ రద్దుపై సీమాంధ్ర ప్రాంతానికి చెందిన రాజకీయ నేతలు రాద్ధాంతం చేయవద్దని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. 14 ఎఫ్‌ను రద్దు చేస్తూ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెల్సిందే. దీనిపై ఎంపీ పొన్నం స్పందిస్తూ 14 ఎఫ్ రద్దును స్వాగతిస్తున్నట్టు చెప్పారు. అయితే, ఇపుడు సీమాంధ్ర నేతలు దీనిపై రాద్ధాంతం సృష్టించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన విద్యార్థుల్లో ఎలాంటి అపోహలు సృష్టించొద్దని పేర్కొన్నారు. ఇపుడు 14 ఎఫ్‌ను రద్దు చేసినప్పటికీ.. ఎస్.ఐ రాత పరీక్షలను మాత్రం నెల రోజుల పాటు వాయిదా వేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అన్ని ప్రాంతాలకు చెందిన విద్యార్థులంతా ప్రత్యేక, సమైక్య ఉద్యమాల్లో పాలుపంచుకున్నారని అందువల్ల వారి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని పరీక్షలను వాయిదా వేయాలన్నారు.

ఇకపోతే.. తెలంగాణ ప్రాంతానికి చెందిన తెదేపా నేతలు రాజీనామాలు చేసి హడావుడిగా బస్సు యాత్రలు చేశారని, ఇప్పుడేమో కాంగ్రెస్ నేతలు చెబితే రాజీనామాలు చేస్తామనడం సబబు కాదన్నారు. జూలై 4వ తేదీన తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెబితే రాజీనామాలు చేశారా అని ప్రశ్నించారు. తెలంగాణ తెదేపా ఫోరంపై ప్రజలకు చిత్తశుద్ధి లేదని పొన్నం ప్రభాకర్ అభిప్రాయపడ్డారు.
=============================
14 ఎఫ్ తెలంగాణ-సీమాంధ్ర సమస్య కాదు: లగడపాటి

14 ఎఫ్ రద్దు అనేది తెలంగాణ-సీమాంధ్ర ప్రాంతాల సమస్య కాదని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అభిప్రాయపడ్డారు. 14 ఎఫ్‌ను రద్దు చేస్తూ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెల్సిందే. దీనిపై విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ 14 ఎఫ్ వల్ల ఎలాంటి నష్టం వాటిల్లదన్నారు. ఫ్రీజోన్ నుంచి హైదరాబాద్‌ను మినహాయించి ఆరో జోన్‌లో కలపడం జరిగిందన్నారు. దీనివల్ల ఆరో జోన్ పరిధిలోని యువత మాత్రమే లాభపడతారన్నారు. ఈ విషయాన్ని తాను మొదటి నుంచి చెపుతున్నట్టు లగడపాటి తెలిపారు. ఉదాహరణకు 12 లక్షల పోలీసు ఉద్యోగాలు ఉంటే ఇందులో 11 లక్షల ఉద్యోగాలు ఇతర జిల్లాలకు వర్తిస్తాయని ఆయన తెలిపారు. అందువల్ల 14 ఎఫ్ వల్ల ఇతర జోన్ పరిధిలోని విద్యార్థులకు ఎలాంటి నష్టం లేదన్నారు. ఇకపోతే.. ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన ఎస్ఐ రాతపరీక్షలు యధావిధిగా ప్రశాంతంగా జరుగుతాయనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
==================================
(Source-MSN WEB DUNIA)

14 ఎఫ్ తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి

12 ఆగస్టు 2011( 14:19 IST )తెలంగాణవాదులు పట్టిన పంతం నెగ్గించుకున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను ఫ్రీజోన్ నుంచి తొలగించారు. ఈ ప్రాంతాన్ని ఫ్రీజోన్‌గా ఉంచే 14 ఎఫ్ నిబంధనను తొలగిస్తూ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో హైదరాబాద్ ఆరో జోన్ పరిధి కిందకు రానుంది. ఈ జోన్‌లో హైదరాబాద్‌, మెదక్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్ నగర్ జిల్లాలు ఉంటాయి. ఫలితంగా ఇకపై హైదరాబాద్ నగర పరిధిలోని పోలీసుల రిక్రూట్మెంట్‌లలో ఆరో జోన్‌కు చెందిన యువకులు మినహా ఇతర జోన్‌లకు చెందిన యువకులు అనర్హులుగా పేర్కొంటారు.  కాగా, ఈ 14 ఎఫ్ నిబంధనపై గత కొంత కాలంగా తెలంగాణ వాదులు  రాద్ధాంతం చేస్తున్న విషయం తెల్సిందే. దీన్ని తొలగించకుంటే ఈనెల 13వ తేదీన జరిగే ఎస్ఐ రాతపరీక్షలను అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా చొరవ తీసుకుని ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్, హోం మంత్రి చిదంబరంలతో స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. ఆ తర్వాత ప్రధాని నేతృత్వంలోని సమావేశమైన రాజకీయ వ్యవహారాల కేంద్ర కేబినెట్ 14 ఎఫ్ నిబంధనను తొలగించాలని కోరుతూ రాష్ట్రపతికి సిఫార్సు చేశారు. ఈ ఫైలుపై రాష్ట్రపతి శుక్రవారం సంతకం చేయడంతో 14 ఎఫ్ వివాదం ముగిసినట్టుగా భావించవచ్చు.
===============================
14 ఎఫ్ నిబంధన తొలగింపు: తెలంగాణ వాదుల్లో హర్షం!

14 ఎఫ్‌ను రద్దు చేస్తూ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై తెలంగాణ వాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు సంబరాలు జరుపుకున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే తమ లక్ష్యమని వారు పేర్కొన్నారు. విద్యార్థులు ఆనందోత్సవాల్లో మునిగి పోయారు. అలాగే, తెలంగాణలోని పలు విద్యార్థి సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. 14 ఎఫ్‌ను రద్దు చేసినంత మాత్రాన తెలంగాణ ఉద్యమం ఆగదని ఏబీవీపీ, పీడీఎస్‌యూ విద్యార్థి సంఘాలు స్పష్టం చేశాయి. ఈ సందర్భంగా వారు రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపారు.

ఇకపోతే.. 14 ఎఫ్‌ను తొలగించడంలో తెలంగాణ వాదుల విజయముందని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత కె.కేశవరావు అన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, తెలంగాణ కాంగ్రెస్ నేతలు పోరాటం చేయడంతో కేంద్రం స్పందించి 14 ఎఫ్‌ను రద్దు చేసిందని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి, సోనియాకు, ప్రధానికి, చిదంబరంకు ధన్యవాదాలు తెలిపారు. 14 ఎఫ్ రద్దు చేయడంతో తెలంగాణ ప్రాంత యువతకు న్యాయం జరిగిందని మంత్రులు దానం నాగేందర్, పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్యలు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి, సోనియాకు, చిదంబరానికి, ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు.
================================
(Source-MSN WEB DUNIA)

(source-andhra jyothi)

Sunday, August 7, 2011

T-Cong MPs shift stand on Parliament boycott - To Attend Parliament Only On Days Necessary

In a partial modification of their stand,T-Congress MPs on Saturday decided to attend monsoon session of Parliament, but only on the days when their presence is required, for instance when passing bills.The steering committee of the T-Congress peoples representatives,which met here on Saturday to discuss whether to continue their boycott of the session,finally decided to climb a step down. The meeting was attended by eight MPs,eight ministers,two MLCs and six MLAs. Opinion was divided among leaders. Members like P Sudhakar Reddy, K A Amos (MLCs) and P Balaram Naik (MP) argued in favor of attending the ongoing Lok Sabha session, while MPs, K Keshava Rao and G Sukhender Reddy opposed the decision as it would send wrong signals to the people on the motives behind such a decision.

Amos, Balaram Naik and Sudhakar Reddy reportedly argued that instead of whiling away their time in meetings,it would be better for the members to go to the House and stall the proceedings in protest.Such a step would force other parties also to think about the issue in the Parliament, they argued. However, Keshava Rao and Sukhender Reddy said,instead of attending the House regularly,MPs would attend the proceedings whenever their presence was required.We can attend the House at the time of voting and other emergency situations, they opined. As for others,while the ministers will continue their protest by abstaining from the office work,MLAs will also boycott the official programs.But all the leaders would attend the Independence Day celebrations on August 15, said Gandra Venkataramana Reddy after the meeting.

Briefing the media after the meeting,MP Sukhender Reddy said the party would take up several programmes as part of their agitation for Telangana state.On August 9,the party would organise protest rallies in memory of Telangana martyrs,Reddy said.Similarly on August 11,the T-Congress would organise protest meetings in Hyderabad against the Centres stand on the removal of 14 (F) clause from the presidential order of 1975. MLA Gandra Venkatararamana Reddy suggested that the TCongress should request the NGOJAC to postpone their proposed strike from August 17 till the completion of the negotiations initiated by AICC general secretary Gulam Nabi Azad with Congress leaders of all regions to evolve a consensus on the Telangana issue.

NGOs strike is a powerful weapon. It should be used as the last resort. So,let us wait for the completion of the talks, he said.
==================================
(Source-TOI)

(Source-andhraa jyothi)

(source-andhra jyothi)

Saturday, August 6, 2011


(source-vaartha)



(Source-vaartha)

(source-vaartha)


(Source-vaartha)
(Source-andhrajyothi)



(source-andhrajyothi)

(source-andhra jyothi)

(source-andhrajyothi)

(source-andhrajyothi)

Friday, August 5, 2011

సింగ్ జీ.. తెలంగాణపై ఏదో ఒకటి తేల్చండి: జైపాల్ రెడ్డి

 ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్‌తో కేంద్ర పెట్రోలియం శాఖామంత్రి, తెలంగాణ ప్రాంత సీనియర్ నేత ఎస్.జైపాల్ రెడ్డి శుక్రవారం కలిశారు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య తెలంగాణ అంశంతో పాటు రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చ జరిగింది. తెలంగాణకు సమస్యకు సత్వర పరిష్కార మార్గం కనుగొనాలని చూసించినట్టు చెప్పారు. ఈ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సమస్యను త్వరగా పరిష్కరించాలని ప్రధానమంత్రిని కోరినట్టు చెప్పారు. అలాగే, హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదశ్ రాష్ట్రంలో నెలకొన్న అసాధారణ పరిస్థితులను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు.

అలాగే, తెలంగాణపై నా భావాలను, అంచలనాలను ప్రధానికి తెలియజేసినట్టు చెప్పారు. అయితే ప్రధానితో జరిగిన పూర్తి విషయాలను మీడియాకు వెల్లడించడం భావ్యం కాదన్నారు. ఏది ఏమైనా సమస్యకు సత్వర పరిష్కారం కనుగొనాలని కోరినట్టు చెప్పారు. అయితే, తెలంగాణ సమస్యకు ఒక్క ప్రధానమంత్రి మాత్రమే పరిష్కారం కనుగొనలేరని, కాంగ్రెస్ నాయకత్వ స్థాయిలోనూ, యూపీఏ భాగస్వామ్య పక్షాలు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. 14ఎఫ్ తొలగింపుపై అసెంబ్లీ తీర్మానాన్ని గౌరవించాలన్నారు.

ఇకపోతే.. తెలంగాణ అంశంలో కాంగ్రెస్ అధినాయకత్వ వైఖరి తనకు తెలియదన్నారు. ఈ విషయంపై హైకమాండ్ పెద్దలతో కలుసుకోవాల్సి ఉందన్నారు. తెలంగాణ, హైదరాబాద్ వాదిగా తన అభిప్రాయాలను వెల్లడించానన్నారు.
=====================================
(Source-MSN WEBDUNIA)

తెలంగాణ పరిష్కారం తెలుగు ప్రజల చేతుల్లోనే: చిదంబరం

శుక్రవారం, 5 ఆగస్టు 2011( 14:04 IST) ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నెలకొన్న తెలంగాణ సమస్యకు పరిష్కారం తమ చేతుల్లో లేదని, తెలుగు ప్రజల చేతుల్లోనే ఉందని కేంద్ర హోంశాఖామంత్రి పి.చిదంబరం (పీసీ) స్పష్టం చేశారు. అందువల్ల అత్యంత జఠిలమైన, సున్నితమైన తెలంగాణ సమస్య పరిష్కారంపై ఆయన చేతులెత్తేనట్టుగా లోక్‌సభలో ప్రకటించారు. డిసెంబరు తొమ్మిదో తేదీకి ముందు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర విభజనకు అంగీకరించారన్నారు. ఈ మేరకు అప్పటి ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాయన్నారు. ఈ సమావేశం మినిట్స్ ఆధారంగానే డిసెంబరు తొమ్మిదో తేదీన కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసిందన్నారు. ఈ ప్రకటన చేసిన వెంటనే సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉత్పన్నమైందని చెప్పారు. దీంతో సమస్య పరిష్కారం కోసం తాము జస్టీస్ శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసినట్టు గుర్తు చేశారు. అయితే, ఈ కమిటీ సమస్యకు పరిష్కారం చూపకుండా ఆరు రకాల సూచనలు చేసిందన్నారు. దీంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చిందన్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని అన్ని పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు చెప్పారు. ముఖ్యంగా, డిసెంబరు తొమ్మిదో తేదీ ప్రకటన తర్వాత రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు రెండుగా చీలిపోయి భిన్నాభిప్రాయాలు వచ్చాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయా పార్టీలు ఏకాభిప్రాయానికి రావాలన్నారు. తమ పార్టీలో ఏకాభిప్రాయం తీసుకొచ్చేందుకు సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ చర్చలు సంప్రదింపులు జరుపుతున్నారన్నారు.
అలాగే, మిగిలిన రాజకీయ పార్టీలు కూడా చర్చలు జరిపి ఒక నిర్ణయానికి రావాలన్నారు. అదేసమయంలో ఆంధ్రప్రదేశ్ యువత ఉద్వేగానికి లోనుకారాదని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ సమస్యకు తెలుగు ప్రజలే ఒక పరిష్కార మార్గాన్ని చూపాలంటూ చిదంబరం తన ప్రసంగాన్ని ముగించారు.
===============================
(source-MSN WEB DUNIA)

తెలంగాణాపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి?: పీసీ

శుక్రవారం, 5 ఆగస్టు 2011( 16:18 IST )


తెలంగాణా సమస్యపై పార్లమెంటులో ప్రసంగిస్తూ కేంద్ర హోంమంత్రి పి. చిదంబరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గురించి ప్రస్తావన చేశారు. తెలంగాణాపై మూడు పార్టీలు మాత్రమే స్పష్టమైన వైఖరిని ప్రదర్శించాయని చెపుతూ మిగిలిన పార్టీలు ఏకాభిప్రాయానికి రాలేకపోయాయన్నారు. కొత్తగా స్థాపించబడ్డ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం తెలంగాణాపై తన అభిప్రాయం ఏంటో ఇంతవరకూ చెప్పలేదని చిదంబరం పేర్కొన్నారు. ఈ ప్రకటనతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కూడా తెలంగాణా సమస్యలోకి లాగేశారు.

ఇటీవల ప్లీనరీ సమావేశాల్లో జగన్ మాట్లాడుతూ.. తమ పార్టీ తెలంగాణా సెంటిమెంటును గౌరవిస్తుందని చెప్పారు. దీనర్థం తెలంగాణాకు అనుకూలమా..? లేదా వ్యతిరేకమా..? అనే చర్చ మొదలైంది. కొండా సురేఖలాంటి నాయకులు జగన్ ప్రకటన తెలంగాణాకు అనుకూలమైనదే అంటే సీమాంధ్రకు చెందినవారు మాత్రం గౌరవిస్తామని అంటే తెలంగాణా రాష్ట్రాన్ని ఇవ్వమని అర్థమా..? అని ప్రశ్నిస్తున్నారు. వీళ్ల వాదనలు ఎలా ఉన్నా కేంద్రహోంమంత్రి మాత్రం తెలంగాణాపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఖరిని కోరుతున్నారు. మరి జగన్ తెలంగాణాపై తన స్టాండ్ ఏంటో వెల్లడిస్తారా...? లేదంటే పాతపాటే పాడుతారా..?
================================
(source-MSN WEB DUNIA)

డిసెంబర్ 9 ప్రకటనకు కట్టుబడాలి: సుష్మా

 న్యూఢిల్లీ : తెలంగాణపై డిసెంబర్ 9న చేసిన ప్రకటనకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉండాలని బీజేపీ నేత సుష్మా స్వరాజ్ డిమాండ్ చేశారు. సోనియాగాంధీ పుట్టినరోజు బహుమతిగా తెలంగాణ అని ప్రకటించిందని ఆమె అన్నారు. డిసెంబర్ 9 ప్రకటనను అన్ని పక్షాలు స్వాగతించాయన్నారు. న్ని ఆలోచించే తీసుకున్న నిర్ణయాన్ని ఎందుకు అమలు చేయటం లేదని ఆమె ప్రశ్నించారు.

తెలంగాణపై ప్రవేశపెట్టిన సావధాన తీర్మానంపై శుక్రవారం ఆమె మాట్లాడుతు తెలంగాణ రాష్ట్రం కావాలంటూ వేలాదిమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. తెలంగాణ కోరుతూ 13మంది ఎంపీలు రాజీనామాలు చేశారన్నారు. గిర్‌గ్లానీ కమిషన్ సిఫార్సులు అమలు కాలేదని, ఫజలలీ కమిషన్ కూడా తెలంగాణ ఇవ్వాల్సిందేనని చెప్పిందని సుష్మా గుర్తు చేశారు. భారత్ కు స్వాతంత్ర్యం వచ్చిన ఏడాదికే తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. షరతులతోనే తెలంగాణ ఆంధ్రాలో విలీనం అయ్యిందన్నారు.

రాష్ట్రపతి ప్రసంగంలోనూ తెలంగాణ ప్రస్తావన ఉందన్నారు. తెలంగాణ డిమాండ్‌తో బలిదానాలు కొనసాగు తున్నాయని ఆమె అన్నారు. తెలంగాణ డిమాండ్‌తో 11మంది కాంగ్రెస్ ఎంపీలు గెలిచారన్నారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ నివేదిక తెలంగాణకు అన్యాయం చేసిందన్నారు. తెలంగాణ చరిత్ర సుదీర్ఘమైందని సుష్మా అన్నారు. కాగా సుష్మా ప్రసంగాన్ని సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు అడ్డుకున్నారు. ఆమె వ్యాఖ్యలను సీమాంధ్ర ఎంపీలు ఖండించారు.
========================
(Source-saakshi taaza)

పార్లమెంటులో తెలంగాణాపై భాజపా సావధాన తీర్మానం

తెలంగాణా అంశంపై కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ అగ్నిపరీక్ష పెట్టబోతోంది. తెలంగాణా సావధాన తీర్మానం పేరిట తెలంగాణాపై గంటపాటు చర్చించబోతోంది. ఈ చర్చలో తెలంగాణాపై కాంగ్రెస్ వైఖరి ఏమిటన్నది ప్రజలకు తేటతెల్లం చేయాలని కంకణం కట్టుకుంది. తాము ప్రవేశపెట్టనున్న తీర్మానంలో చర్చించేందుకు శుక్రవారంనాడు తెలంగాణా ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు హాజరు కావాలని కోరింది. అయితే దీనిపై రాజీనామా చేసిన కాంగ్రెస్ ఎంపీల్లో విభిన్నమైన వాదనలు వినబడుతున్నాయి. సభలో ఇప్పటికే తాము తెలంగాణాకోసం చేయాల్సినవన్నీ చేశామనీ, ఇక ఇప్పుడు అధిష్టానంతోనే తమకు పని అని చెపుతున్నారు.

మరోవైపు తెలంగాణాపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీమాంధ్ర ప్రాంత ఎంపీలు ఆసక్తిని చూపారు. రేపు భాజపా తెలంగాణాపై చేసే చర్చలో భాజపా అనుసరిస్తున్న వైఖరిని దనుమాడాలని సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు సన్నద్ధమవుతున్నారు. ఇదిలావుంటే తెలంగాణా అంశంపై కాంగ్రెస్ - భాజపాలతోపాటు తృణమూల్ కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీ.. ఇలా ఇతర పార్టీలు కూడా వెల్లడించాల్సి ఉంటుంది. మొత్తమ్మీద కాంగ్రెస్ పార్టీకి రేపు పార్లమెంటులో ఊపిరాడని పరిస్థితి నెలకొనబోతోంది.
===========================
(Source - MSN WEB DUNIA)

దారికొస్తే సరేసరి.. లేదంటే కేకేపై వేటు వేద్దాం: కాంగ్రెస్!!

శుక్రవారం, 5 ఆగస్టు 2011( 08:50 IST )

తమ పదవులకు రాజీనామా చేసిన తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధుల పట్ల కఠిన వైఖరిని అవలంభించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఇందులోభాగంగా, పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ చేస్తున్న బుజ్జగింపులకు తలొగ్గి దారికొస్తే సరేసరి.... లేకుంటే పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావుపై తొలి వేటు వేసి మిగిలిన వారిని దారికి తెచ్చుకోవాలన్న పట్టుదలతో ఉన్నట్టు ఏఐసీసీ వర్గాల సమాచారం. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగంగా టిజాక్ ఇచ్చిన పిలుపు మేరకు టి కాంగ్రెస్ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన విషయం తెల్సిందే. ఈ రాజీనామాలను ఉపసంహరించుకోవాలని ఎంతగానో మొత్తుకుంటున్నా వారు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో అధిష్టాన వర్గం ఓ పకడ్బందీ వ్యూహాన్ని రూపొందించినట్టు తెలుస్తోంది.
వాస్తవంగా కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం నుంచి 32 మంది ఎంపీలు ఉన్నప్పటికీ.. తెలంగాణకు చెందిన తొమ్మిది మంది లోక్‌సభ సభ్యులు, ఒక రాజ్యసభ సభ్యుడు రాజీనామా చేశారు. ప్రస్తుత పరిస్థితిలో కాంగ్రెస్‌కు లోక్‌సభ సభ్యుల అవసరం అత్యంత అవసరమైనప్పటికీ నేరుగా స్పీకర్‌కు రాజీనామాలను ఇవ్వడం ద్వారా పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారన్న ఆగ్రహంతో అధిష్టాన ఉంది. రాజీనామాలను ఉపసంహరించుకోని పక్షంలో ఆమోదాల వేటు వేయక తప్పదన్న అభిప్రాయంతో కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు.



ఇందుకోసం ఒక రక్షణాత్మక మార్గాన్ని ఎంచుకున్నట్టు సమాచారం. ఇందులోభాగంగా తొలుత రాజ్యసభ సభ్యుడు కె.కేశవ రావు రాజీనామాను ఆమోదించడం ద్వారా రాజీనామాలు చేసిన లోక్‌సభ సభ్యులకు హెచ్చరికలు పంపాలన్న ఆలోచనతో అధిష్టానం ఉంది. కేశవరావు రాజీనామాను ఆమోదించడం వల్ల రాజకీయంగా కాంగ్రెస్‌కు కలిగే నష్టం ఏమీ లేదు.

ఆ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీనే మళ్లీ గెలుచుకుంటుంది. అదే లోక్‌సభ సభ్యుల రాజీనామాలను ఆమోదించినట్లయితే మళ్లీ గెలుచుకుంటామన్న ధీమా కాంగ్రెస్‌కు లేదు. అందుకే కేకేపై తొలి వేటు వేయాలన్న నిశ్చితాభిప్రాయానికి వచ్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. తెలంగాణ అంశంలో సొంత పార్టీ నుంచి, ప్రతిపక్షాల నుంచి ఎన్ని హెచ్చరికలు వచ్చినప్పటికీ తమపని తాము చేసుకుపోవాలన్న అభిప్రాయంతో పార్టీ నాయకత్వం ఉంది. ఇది అత్యంత జఠిలమైన సమస్య కావడం వల్ల తలదూర్చి లేనిపోని సమస్యలు కొని తెచ్చుకోవడమెందుకన్న భావనతో ఉంది. పైపెచ్చు.. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినప్పటికీ.. దానివల్ల పార్టీకి పెద్దగా ప్రయోజనం ఉండదని తేలిపోయింది. దీంతో ఎంపీల రాజీనామాల పట్ల కాస్త కఠువుగా వ్యవహరించాలని అధిష్టానం భావిస్తోంది.
======================
(Source-MSN WEBDUNIA)

తెలంగాణ ఏర్పాటుకు మొదటి ద్రోహీ కేకే: ఎంపీ సర్వే ఫైర్రు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మొట్టమొదటి ద్రోహి రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావేనని, అందువల్ల ఆయన రాజీనామాను తక్షణం ఆమోదించాలని మల్కాజ్‌గిరి ఎంపీ సర్వే సత్యనారాయణ డిమాండ్ చేశారు. అంతేకాకుండా తనకు మంత్రి పదవి దక్కకుండా చేశాడని ఆరోపించారు. ఇందుకు కేంద్ర మంత్రి ఎస్.జైపాల్ రెడ్డి సాయం తీసుకున్నట్టు ధ్వజమెత్తారు. తెరాస అధినేత కే.చంద్రశేకర్ రావు, టిజాక్ ఛైర్మన్ కోడందరామ్‌ల ప్రోద్బలంతో టి కాంగ్రెస్ ఎంపీలతో రాజీనామాలు చేయించి వారిని బలిపశువులు చేశారని సర్వే ఫైర్ అయ్యారు. అందువల్ల కేకే రాజీనామాను ఆమోదిస్తే అన్నింటికీ పరిష్కార మార్గం లభిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.

దీనిపై ఆయన మాట్లాడుతూ టి కాంగ్రెస్ ఎంపీలు చేసిన రాజీనామాల వల్ల ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కాదన్నారు. గతంలో చేసినట్టుగానే పార్లమెంటు సమావేశాలను స్తంభింపజేసి ఉంటే బాగుండేదన్నారు. డిసెంబర్ తొమ్మిదే తేదీ కంటే డిసెంబర్ 23 ప్రకటనలోనే తెలంగాణపై స్పష్టమైన వాగ్దానం ఉందని సర్వే చెప్పుకొచ్చారు. తెలంగాణపై అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరాల్సి ఉందన్నారు. అపుడే రాష్ట్ర ఏర్పాటు సులభమవుతుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యపడక పోవచ్చన్నారు.
=============================
(source-MSN WEB DUNIA)
(Source-andhra jyothi)
(Source-andhra jyothi)

(Source-andhra jyothi)

(Source- saakshi)

Thursday, August 4, 2011

రేపు లోకసభలో తెలంగాణపై చర్చ!


న్యూఢిల్లీ:   లోకసభలో శుక్రవారం మధ్యాహ్నం
12 గంటలకు తెలంగాణ అంశంపై చర్చకు స్పీకర్ ఆమోదించారు. బీజేపీ ప్రవేశపెట్టిన సావధాన తీర్మానంపై లోకసభలో చర్చ జరుగనుంది.
తెలంగాణ అంశంపై బీజేపీ తరపున సుష్మా స్వరాజ్, గోపినాధ్ ముండే, సీపీఐ ఎంపీ గురుదాస్ దాస్‌గుప్తా, కాంగ్రెస్ పార్టీ నుంచి సర్వే సత్యనారాయణ చర్చలో పాల్గొననున్నారు.
================
(SOURCE-SAAKSHI TAAZA)



తెలంగాణాలో సకల జనుల సమ్మె: పాల్గొన్నవారు ఇంటికే..

గురువారం, 4 ఆగస్టు 2011( 19:36 IST )


ఈ నెల 8 నుంచి తెలంగాణా ప్రాంత ఉద్యోగ సంఘాలు చేయతలపెట్టిన సకల జనుల సమ్మెపై ప్రభుత్వం ఎస్మాస్త్రం ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. అయితే అంతకంటే ముందే 14 ఎఫ్‌ను రద్దు చేయడం ద్వారా ఉద్యోగులను శాంతింపజేయాలని చూస్తోంది. 14 ఎఫ్‌ను తొలగించినప్పటికీ పట్టించుకోకుండా సమ్మెలో పాల్గొనే ఉద్యోగులపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆర్థిక సేవలను అత్యవసర సేవలుగా భావిస్తూ జీవో నెంబరు 166ను జారీ చేసింది. ఆ శాఖల్లోని వారు సమ్మెలో పాల్గొంటే వారిపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించవచ్చు. దీనితోపాటు మాట వినని ఉద్యోగులపై మరింత పదునైన అస్త్రాన్ని ప్రయోగించాలని ప్రభుత్వం చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆర్టికల్ 311ను ప్రయోగించడం ద్వారా సమ్మెలో పాల్గొన్నవారిని ఉద్యోగం నుంచి తొలగించే వీలుంది. మొండిగా వెళ్లేవారిపై ఈ చట్టాన్ని ప్రయోగించాలని ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ప్రభుత్వం ఎన్ని బెదిరింపులు చేసినా తాము ఆగస్టు 8 నుంచి సకల జనుల సమ్మెకు దిగుతామని ఉద్యోగ సంఘాల జేఏసి కుండబద్ధలు కొట్టినట్లు చెప్పింది. తమ ఉద్యోగాలు పోయినా తమకేం బాధ లేదనీ, తమకు తెలంగాణా రాష్ట్రమే ముఖ్యమని వారు వెల్లడించారు.

ఇంకోవైపు నెలవారీ జీతం వస్తే గానీ పూటగడవని ఉద్యోగులు విధులకు హాజరు కావాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటువంటి వారికి తగిన రక్షణ కల్పించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. హైదరాబాదులో సుమారు 100 పారామిలటరీ దళాలను మొహరించారు. విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు రక్షణ కల్పిస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఆగస్టు 8న ప్రారంభించిన సకల జనుల సమ్మె ఆగస్టు 17 నాటికి తీవ్రరూపం దాల్చి తెలంగాణా ప్రాంతాన్నంతా స్తంభింపజేస్తుందని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఏం జరుగుతుందో చూడాల్సిందే.
==================================
(SOURCE- MSN WEB DUNIA)

Teachers exhorted to spearhead T stir - Harish Rao Urges Them To Tear Pages From Textbooks With Maa Telugu Talli Song

The Telangana political JAC is betting big on the 1.70 lakh teacher force in the region to ensure the success of the proposed people's strike beginning August 17. Addressing teachers,who were on a one-day deeksha at the dharna chowk in Lower Tank Bund on Wednesday,political JAC chairman M Kodandaram Reddy said that teachers must take the lead during the indefinite general strike proposed from August 17.You have the ability to mould the opinion of every child and his or her parent in every village.I call upon all of you to take the responsibility of convincing every household in your respective areas to express support to the strike call by pouring on to the streets across Telangana region in support of the demand for the formation of Telangana state, he said. "You are torch-bearers of this movement.  You must ensure that the Telangana slogan is heard in every g a l l i across the region.Only then will rulers in Delhi respond in an appropriate manner,"the TJAC chairman said.Urging teachers to stay united at this critical hour,he asked them to be on guard against destructive forces trying to break their unity.The TJAC chairman also reiterated his demand asking MLAs to resign before August 6 and said there would be no compromise on the issue.

TJAC convenor and TNGO president K Swami Goud urged Congress and TDP MLAs to resign afresh."Please do not shoot from the shoulders of employees.Tell us what else you can do for the movement,"he said. "If teachers are in the forefront of the movement,people will follow you without fail.You have the potential to knock on every door and influence each and every person in Telangana.I call upon teachers to participate in the general strike in large numbers from August 17 and choke the state government.Only then will we see a reaction from the Centre,"he observed.

Speaker after speaker reminded teachers that they alone had the potential to sustain the movement and take it to the final level.Siddipet legislator T Harish Rao called upon teachers to tear pages from school textbooks which had the song `Maa Telugu Talli in it."I request all of you to hold a one-day programme to burn pages of this song in front of every school,as this song represents Seemandhra people's dominance and influence on us, he said.

Nagam Janardhan Reddy urged them to keep the flame of the Telangana movement alive among all students and parents till the formation of the new state."Please seize this opportunity to send across a strong message to the elected representatives from the region that the movement is no longer in their hands.We will have to start the quit Telangana movement and drive out all forces that are working against the interests of Telangana,"he said.

Meanwhile,T TDP MLAs'convenor Errabelli Dayakar Rao was forced to leave the deeksha venue by the teachers,who accused him of being an agent of TDP chief N Chandrababu Naidu.They shouted slogans and vented their ire at Rao by displaying their footwear."You are welcome here only when you quit the TDP,"they shouted.





WITH RENEWED VIGOUR: Teachers across the Telangana region listen to a speaker during a T JAC meeting at Indira Park on Wednesday

===========================
(Source-toi)

T MPs likely to attend LS to corner PC

Telangana Congress MPs,who have been boycotting the monsoon session of Parliament,are mulling over attending the House on Friday as the Telangana issue is expected to figure in the Lok Sabha. On Friday, the Telangana issue is expected to come up under calling attention of the Union home minister. The notice is given by leader of the opposition and BJP MP Sushma Swaraj.Some T-Congress members want to attend the House so that they can raise their voice and seek clarification on issues such as 14(F) and P Chidambarams December 9,2010 statement. Talking to TOI,K Keshava Rao said there was nothing wrong in participating in a debate that deals with a burning issue.
================================
T activists to face arrests in cases

In what could be another indication that the government was tightening the screws on pro-Telangana agitators,police are preparing the ground to arrest Telangana JAC convenor Prof Kodandaram and three TRS MLAs in connection with a public meeting which was held last year in violation of the prohibitory orders.In another development,13 TRS leaders were arrested here on Wednesday for their involvement in the attack on the house of TDP MLA.They were released on bail in the evening.

The Warangal cops are planning to arrest Kodandaram and TRS MLAs -- Harish Rao,Etela Rajender and D Vinaya Bhaskar -- for violating Police Act 30.They were booked under Sections 143,290 and 196 of IPC.Sources said the police would press ahead with the charges as the TRS MLAs along with Kodandaram conducted a public meeting at the martyrs memorial at Adalath junction despite prohibitory orders on March 24,2010.A police team would go to Hyderabad to take these leaders into custody, a senior police official said. Earlier in the day,TRS Warangal district convenor Peddi Sudarshan Reddy and 12 leaders were taken into custody on the charges that they had taken part in the attack on Palakurthy MLA Errabelli Dayakar Raos (TDP) residence here on May 25.Sudarshan and others were booked under Sections 147,435,427 read with 149 of IPC and section 7(1) and produced before the fourth additional judicial first class magistrate.

Among the arrested include Telangan Graduates Association state president Marri Yadava Reddy,TRS politburo member Ramagalla Parameshwar,TRS youth district chief Indla Nageshwar Rao,party leaders B Bharathkumar Reddy,Bollam Rakesh,Kotha Vishnuvardhan Reddy,Juni Darshan Singh,Lingampalli Kishan Rao,Marupalli Ravi,Nagurla Venkateshwarlu and former ZTPC members Marneni Ravinder Rao and Banoth Harinath Singh.The judge later granted them bail.

Former ZP vice-chairman Muluguri Bikshapathi and three other TRS leaders,who also took part in the attack on Errabellis house,are absconding and yet to be arrested.Sources said Sudarshan along with five student leaders was booked in another case for attacking Subedari station house officer Venkateshwara Babu.He was charged under Sections 147,353,352 read with 149 of IPC.Student leaders,Vasudeva Reddy,Veerender,J Ramesh,G Srinivas Reddy and Mahesh who were sent to Warangal prison on Tuesday for the attack on minister Ponnala Lakshmaiah were booked in the case along with Sudarshan.

Sources said the Hanamkonda police were also preparing the ground to arrest these student leaders on Thursday for their role in the attacks on the Congress party office in Hanamkonda in the last one year.
All these developments came close on the heels of arrest of 13 Kakatiya University students on Tuesday and summons to TRS MLAs Harish Rao and three others in connection with the assault on AP Bhavan official in Delhi.
================================
T protagonists not to pay toll tax

Telangana protagonists in Adilabad district have decided to stop paying fee at toll gates between Adilabad and Nirmal on national highway-7 from August 17 as part of the non-cooperation movement. Speakers at a round-table meeting held in Adilabad on Wednesday evening urged the people to stop paying toll tax saying that the amount would be going into the hands of Andhra contractors.They alleged that the Andhra contractors had got contract works for laying the four-lane roads in Telangana region but were opposing the division of the state.TDP MLAs S Venugopalachay,Jogu Ramanna and G Aravind Reddy took part in the meeting.
=============================== 
(Source-toi)
(source-andhrajyothi)

Wednesday, August 3, 2011

(source-andhra jyothy)
(source-andhra jyothy)